Huzurabad Election Etela Won:హుజూరాబాద్‌లో ఈటల గెలపునకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?

Etela Rajender Latest News

Huzurabad Election  Etela Won

iRAYSMEDIA

Huzurabad Election  Etela Won: సాధారణంగా ఉప ఎన్నిక అనగానే అధికార పార్టీదే హవా కొనసాగుతుంది కానీ, హుజూరాబాద్‌లో మాత్రం అలా జరుగలేదు.

అధికార TRS పార్టీని కార్ ని ఢీకొట్టి ధీటుగా నిలిచారు ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో మరోసారి జయకేతనం ఎగురవేశారు. KCR తో ఛాలెంజ్‌ చేసి ఈటల రాజేందర్ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి చూపించారు . ఆత్మగౌరవం – అహంకారం నినాదం పేరుతో జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ ఈటలకె పట్టం పట్టారు . గతంతో పోలిస్తే ఈటల రాజేందర్ మెజార్టీ తగ్గినా.. విజయం కైవసం చేసుకున్నారు . వ్యక్తిగత ఇమేజే ఈటలను బయటపడేసిందా?

6 సార్లు గెలిచిన అనుభవం పనిచేసిందా

 సానుభూతి-ఆత్మగౌరవ నినాదం..
5 నెలల పాటు అత్యంత ఉత్కంఠను రేకెత్తించిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలనే గెలుపు వరించింది. 2 రౌండ్లు మినహా అన్నింటిలోనూ లీడ్‌ కొనసాగించారు. నియోజవర్గంలోని 5 మండలాల్లోనూ ఆధిపత్యం చేలాయించారు. ఈటల విజయానికి ప్రధాన కారణం సానుభూతి. . ఈటల ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడంతో జనాల్లో పెరిగిన సాఫ్ట్‌కార్నర్.

 ఈటలకు వ్యకిగతమైన ఇమేజ్..

ఈటల బీజేపీలో చేరినప్పటికీ ప్రజలు ఆయన్ను బీజేపీ నేతగా చూడలేదు. ఈటలను ఈటలగానే చూశారు. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌వల్లే అయన విజయం చేకూరింది అని చెప్పాలి.

ఈ మధ్య కాలంలో గ్యాస్‌ సిలిండర్, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగిన అవి ఏ మాత్రం ప్రభావం చూపలేదని లేదని చెప్పాలి . టీఆర్ఎస్ కూడా తన ప్రచారంలో గ్యాస్‌ సిలిండర్, పెట్రోల్‌ ధరలు ఈ అంశాలను పదేపదే ప్రస్తావించిన ఆ ఎఫెక్ట్‌ ఓట్లపై పడలేదు.

రాజీనామా తర్వాత ప్రజల్లోనే మమేకమై ఉండటం..

జూన్‌12వ తేదీన ఈటల తన పదవులకు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకు ప్రజల్లోనే ఉన్నారు. నియోజకవర్గం దాటి బయటకు రాలేదు. పాదయాత్రతో అన్ని మండలాలనూ చుట్టేశారు. ఇంటింటికీ వెళ్లారు. ప్రతి ఓటరును కలిశారు.

 కలిసొచ్చిన సామాజిక సమీకరణాలు..

క్యాస్ట్ ఈక్వేషన్స్‌ కూడా ఈటలకు కలిసొచ్చాయి అని చెప్పాలి బీసీ ఓట్లు పెద్దసంఖ్యలో పడ్డాయి. ఆయన భార్య కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అందుకే ఈటల కి అండగా రెడ్డి సామాజికవర్గం కూడా నిలిచింది.

 గెల్లు ఈటలకు సరితూగలేదనే భావన..

అసలు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను ఈటలకు దీటైన అభ్యర్థిగా ప్రజలు భావించలేదనే చెప్పాలి. పైగా ఒకప్పుడు ఈటల రాజేందర్ కి ప్రధాన అనుచరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. దీంతో ఓటర్లు సీనియార్టీకే ప్రాధాన్యత ఇచ్చారు.

 ఈటలకు మళ్లిన కాంగ్రెస్ ఓటుబ్యాంక్‌..

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ మొదటి నుంచి వెనుకంజలోనే ఉంది. జస్ట్‌ పోటీలో ఉన్నారంటే ఉన్నారంతే. బల్మూరి వెంకట్‌ లాంటి బలహీనమైన అభ్యర్థిని పెట్టడంతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ బీజేపీ వైపు మళ్లింది.

 ఇతర కుల్లాల్లో కనిపించిన . దళితబంధుతో అసంతృప్తి..

తెరాస దళితబంధు పథకం రివర్స్‌ అయినట్లు కనిపించింది హుజురాబాద్ లో . ప్రభుత్వానికి అనుకూలంగా మారాల్సింది పోయి ఈటలకు ప్లస్‌పాయింట్‌ అయింది.

 ఆరుసార్లు గెలిచిన అనుభవం..

ఈటలకు హుజురాబాద్ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. తన సొంత గ్రామం కమలాపూర్‌లోనూ తిరుగులేని ఓటు బ్యాంక్ సంపాదించుకున్నారు . పైగా ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది. ఇవన్నీ మరోసారి ఈటల రాజేందర్ కి బాగా కలిసి వచ్చాయి.

నియోజకవర్గంలో ఈటల కి ఉన్న పరిచేయలు ..

ఈటలకు హుజురాబాద్ నియోజకవర్గంలోనూ వ్యక్తిగత పరిచయాలున్నాయి. మొత్తం హుజురాబాద్ నియోజకవర్గం 5 మండలాల్లోనూ రైతులు, వ్యాపారవేత్తలు, కులసంఘాల నేతలు… ఇలా అందరితోనూ మంచి సంబంధాలున్నాయి. పార్టీలకు అతీతంగా ఆ ఓట్లన్నీ ఈటలకు పడ్డాయి.

READ MORE:

Huzurabad By Election 2021:చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు

Dalita Bandhu:‘దళిత బంధు’ అందరికీ అందించకపోతే, వారు దీక్ష చేస్తారు | If ‘Dalita Bandhu’ is not provided to everyone, they will initiate

Previous Post
Shahrukh Khan Birthday Celebrations:సెలెబ్రెటీలు ఎవర్ని ఇంటికి రావద్దన్న షారుక్‌ ఖాన్‌
Next Post
One More BY-Election In Telangana:రాష్ట్రంలో త్వరలో మరో ఉపఎన్నిక ఎక్కడంటే
Shahrukh Khan Birthday Celebrations:సెలెబ్రెటీలు ఎవర్ని ఇంటికి రావద్దన్న షారుక్‌ ఖాన్‌
One More BY-Election In Telangana:రాష్ట్రంలో త్వరలో మరో ఉపఎన్నిక ఎక్కడంటే

Recent Posts

Menu