Huzurabad By Poll: హుజురాబాద్ లో రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

Huzurabad By Election Results

Huzurabad By Poll

iRAYSMEDIA

Huzurabad By Poll:కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యం లో డబ్బు, మద్యం ఎక్కువ పంపిణీ చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ఆరా తీసింది.

ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందంచి తగిన చర్యలు తీసుకోవాలని పోలింగ్‌ ఏర్పాట్లపై ఈసీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు . రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ , పోలీసుశాఖ నోడల్‌ అధికారి జితేందర్‌, హనుమకొండ ,కరీంనగర్‌,జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల పరిశీలకులు సమీక్షకు హాజరయ్యారు.

పోలింగ్‌ ఏర్పాట్లపై శాంతిభద్రతలు, కొవిడ్‌ నిబంధనల అమలుపై సమీక్షించిన ఈసీ అధికారులు అన్నిటి మీద ఆరా తీశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కమిషన్‌.. స్థానికేతరులు ఇంకా ఎక్కడైనా ఉంటే వారిని వెంటనే పంపించివేయాలని ఆదేశించింది. హుజురాబాద్ లో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూస్తూ పోలింగ్‌ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులు తెలిపారు.

ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీకున్నారని ప్రశ్నించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ఇప్పటి వరకు రూ.3.52 కోట్ల విలువైన సొత్తుని హుజురాబాద్ లో స్వాధీనం చేసుకున్నామని సీఈవో వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటూ జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఈసీ స్పష్టం చేసింది.

READ MORE:

Central Home Department: హోం శాఖ పరిశీలనలో ఉన్న దిశ బిల్లులు | Disha Bills under Home Department consideratio

Visakhapatnam drugs load caught:పోలీసులు వాహనాన్ని ఆపి, డ్రైవర్ పారిపోయాడు | Police stopped the vehicle and the driver fled

Previous Post
Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్
Next Post
GHMC Fines Trs Flexis:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జీహెచ్ఎంసీ భారీ జరిమాన
Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్
GHMC Fines Trs Flexis:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జీహెచ్ఎంసీ భారీ జరిమాన

Recent Posts

Menu