Huzurabad By Poll Election: నామినేషన్ వేసిన ఈటల జామున

huzurabad by election

Huzurabad By Poll Election,  NEWS

iRAYSMEDIA

Huzurabad By Poll Election :హుజురాబాద్ ఉపఎన్నికలో నామినేషన్ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుందని చెప్పాలి

అక్టోబర్ ఒకటిన హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఈరోజు (అక్టోబర్ 8వ తేదీ) నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైయాయ్ అని చెప్పాలి . రిటర్నింగ్ ఆపీసు వద్దకు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు చేరుకున్నారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున భారతీయ జనతా పార్టీ(BJP) తరపున మరో సెట్ నామినేషన్ పత్రాలను స్వయంగా ఆమె హుజురాబాద్ ఆర్డివో కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. Eatala Jamuna గారు

అయితే ఇప్పటికే ఈటల జమున పేరిట బిజెపి అభ్యర్థిగా ఓ సెట్ నామినేషన్ దాఖలు చేసారు జమున తరుపున BJP నాయకుడు అయిన కనుకుంట్ల అరవింద్ ఓ సెట్ నామినేషన్ పత్రాలను గత సోమవారమే రిటర్నింగ్ అధికారికి అందజేసారు. తాజాగా స్వయంగా ఈటల జమునే ఈరోజు మరో సెట్ నామినేషన్ పాత్రలను రిటర్నింగ్ అధికారికి అందజేసారు.

అయితే భారతీయ జనతా పార్టీ(BJP) ముందుజాగ్రత్త కోసమే ఈటల జమునతో నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది. నామినేషన్లకు చివరిరోజయిన ఈరోజు ఈటల రాజేందర్ కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. బిజెపి అభ్యర్థి “Eatala Rajender ” అని… జమున నామినేషన్ ముందుజాగ్రత్త మాత్రమేనని ఇప్పటికే ఆ BJP పార్టీ నాయకులు స్పష్టం చేసారు

 

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా హుజురాబాద్‌ చేరుకొని గత శుక్రవారమే మద్యాహ్నం హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. గెల్లు శ్రీనివాస్ వెంట నామినేషన్ ప్రక్రియలో “ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్ ‘బండ శ్రీనివాస్”, అలాగే ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు “వినోద్ కుమార్” మరియు టీఆర్ఎస్ నాయకులు పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఇక బల్మూరు వెంకట్‌ (వెంకట నర్సింగరావు) కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈరోజు చివరి రోజు కావడం వల్లా “ఈటల రాజేందర్” మరియు “బల్మూరు వెంకట్” ఇద్దరు నామినేషన్ వేయనున్నారు.

ఈటల నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు
బల్మూరి నామినేషన్ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

READ MORE:

Set Exams in Telangana: నేటి నుండి తెలంగాణలో పరీక్షలు సెట్ చేయండి | Set exams in Telangana from today

ఈటల భూ వ్యవహారాలపై ఉన్నతస్ధాయి విచారణను స్వాగతిస్తున్నాం- సిపిఐ(ఎం)

Previous Post
Telugu Bigg-Bos-5 Latest Update: విష్ణు ప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ
Next Post
Hyderabad Rain News Today:హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం.
Telugu Bigg-Bos-5 Latest Update: విష్ణు ప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ
Hyderabad Rain News Today:హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం.

Recent Posts

Menu