Huzurabad By-Election Today Update:డబ్బుతో పట్టుబడ్డ TRS నేతను వదిలేసినా అధికారులు

Huzurabad By-Election Today Update

Huzurabad By-Election Today Update

iRAYSMEDIA

Huzurabad By-Election Today Update:పోలింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో.. హుజూరాబాద్‌లో ప్రలోభాలు మరింత జోరుగా సాగుతున్నాయి.

హుజురాబాద్ లో ఇప్పటికే కోట్ల రూపాయల డబ్బు నేరుగా ఓటర్ల ఇళ్లకు చేరింది కూడా. హుజురాబాద్ నియోజకవర్గం లో కొన్నిగ్రామాల్లో అయితే నగదు అందలేదని ఓటర్లు ఏకంగా రోడ్డు ఎక్కినా దృశ్యాలు వైరల్‌గా మారాయి. అధికార పార్టీ ఆగడాలు ఆపలేకపోతున్న పోలీసులు, ఎన్నికల అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుజురాబాద్ లో కొన్ని చోట్ల అయితే వారే దగ్గరుండి డబ్బు పంపిణీని పర్యవేక్షిస్తున్నట్లు ఆరోపణలు కూడా వేక్తమవుతున్నాయి. అయినప్పటికీ వారు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు బలాన్నిచ్చేలా తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.

కమలాపూర్ మండలం అంబాల చెక్ పోస్ట్ వద్ద కమలాపూర్ జడ్పీటీసీ లాండిగ కళ్యాణి డబ్బును తరలిస్తూ దొరికిరు. తనిఖీల్లో ఆమె దగ్గర 1.30 లక్షల రూపాయలు బయటపడ్డాయి.మరొక TRS నేతతో కలిసి ఆమె వాహనంలో ఈ డబ్బును వెంట కమలాపూర్ చెక్ పోస్ట్ గుండా తీసుకెళ్తున్నారు. అయితే డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. టీఆర్ఎస్ లీడర్ వాహనాన్ని మాత్రం వదిలేశారు.అయితే పోలీసులు వదిలివేసిన టీఆర్ఎస్ నేత వాహనంలో భారీగా డబ్బు ఉందని, దాన్ని పట్టించుకోకుండానే పోలీస్ అధికారులు విడిచిపెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో హుజురాబాద్ పోలీస్ అధికారుల తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

READ MORE:

Check for Property Tax: ఆస్తి పన్ను స్వీయ-అంచనా అక్రమాలకు చెక్ పెట్టాలా? | Check for property tax self-assessment irregularities?

Huzurabad By Poll: హుజురాబాద్ లో రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

Previous Post
GHMC Fines Trs Flexis:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జీహెచ్ఎంసీ భారీ జరిమాన
Next Post
RRR Release Date Confirmed:సంక్రాంతి కానుకగా RRR
GHMC Fines Trs Flexis:టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జీహెచ్ఎంసీ భారీ జరిమాన
RRR Release Date Confirmed:సంక్రాంతి కానుకగా RRR

Recent Posts

Menu