Huzurabad By Election Results:హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిదో తెలుసా

Huzurabad By Election Results

Huzurabad By Election Results

iRAYSMEDIA

Huzurabad By Election Results:

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిశాక కూడా చర్చనీయాంశంగా మారింది అనే చెప్పాలి

శనివారం పోలింగ్ అనంతరం ఈవీఎంలు స్ట్రాంగ్ రూంలకు చేరాక నేతలు విజయావకాశాలపై ఏ పార్టీ లెక్కలు ఆ పార్టీ వేసుకుంది. హుజురాబాద్ లో పోలింగ్ సమయం ఉ .7 గంటల నుంచి సా . 5 గం.ల వరకుఉండగా గతంతో పోలిస్తే ఈసారి రెండు గంటలు అదనంగా రాత్రి 7 గంటలకు పెంచడం వల్ల ఈసారి భారీగా పోలింగ్ నమోదవడానికి దోహదాపడిందని చెప్పాలి . హుజూరాబాద్ ఉప ఎన్నికలో 86.64 శాతం ఓట్లు పోలయ్యాయని ఆదివారం ఆర్డీవో , ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ రవీందర్రెడ్డి ప్రకటించారు .

మునుపెన్నడూ లేని విధంగా ఈ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంనట్లు తెలిపారు. భారీగా ఓటింగ్ పాల్గొన్న ఓటర్లను అభినందించారు . కొన్ని గ్రామాల్లో అయితే 90 శాతం పైగా పోలింగ్ నమోదైనట్లు సమాచారం . మరోవైపు నవంబరు 2 న ఈ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడవనున్నయి. ఈ నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీల ఇన్ ఛార్జ్ లు ఎన్నిక జరిగిన తీరుపై విశ్లేషణలు ప్రారంభించారు .

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా తరువాత రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారాయి. రాష్ట్ర రాజకీయాలకు, వచ్చే ఎన్నికలకు ఈ హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలను ముడి పది ఉండటం తో అంతా ఒక్కసారిగా హుజురాబాద్ వైపు చూడటం ప్రారంభించారు. అక్కడ ఏం జరిగినా , మీడియాలో హాట్ టాపిక్ గా రావడంతో స్థానిక ఓటర్లతోపాటు తెలుగురాష్ట్రాల ప్రజల్లో రోజురోజుకు ఆసక్తి పెంచింది .

శనివారం రోజున ఉప ఎన్నిక పోలింగ్ సందర్బంగా భారీగా పోలింగ్ శాతం నమో దైంది . హుజూరాబాద్ ( 85.66 % ) , వీణవంక ( 88.66 % ) , జమ్మికుంట ( 83.66 % ) , ఇల్లందకుం ( 90.73 % ) , కమలాపూర్ ( 87.57 % ) భారీగా పోలింగ్ శాతం నమోదైంది . హుజురాబాద్ నియోజకవర్గంలో పురుషులు 87.05 శాతం ఓటు వేయగా .. మహిళలు 86.25 శాతం ఓటేశారు . వాస్తవానికి ఈ నియోజకవర్గం లో మహిళల సంఖ్య పురుషుల సంఖ్య కన్నా అధికంగా ఉన్నా .. ఓటు హక్కు వినియోగంలో పురుషులదే పైచేయిగా నిలవడం గమనార్హం . మొత్తం మీద 86.64 % పోలిం గ్ నమోదవడం అటుఅధికారుల్ని , ఇటు రాజకీయ నేతల్ని ఆశ్చర్యపరిచింది .ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో 2,36,873 ఓటర్లు ఉంటె మొత్తం మీద 20,5236 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు

అయితే ఉప ఎన్నికలో సైలెంట్ ఓట్లు బాగా పడ్డాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది . మొత్తం 30. మంది అభ్యర్థులు బరిలో ఉండగా .టీఆర్ఎస్, బీజేపీ,కాంగ్రెస్ ల మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది . మిగిలిన ఇండిపెండెంట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపో యారు . ముఖ్యంగా టీఆర్ఎస్- బీజేపీల మధ్య పోరు తార స్థాయికి చేరిందని చెప్పాలి. ఈ రెండు పార్టీలు హోరాహోరీగా ప్రచారం , ఓటింగ్ జరిగాయి . దీంతో సైలెంట్ ఓట్లు బాగా పడ్డాయన్న ఇప్పుడు విపరీతంగా చర్చ నడుస్తోంది .

వీరు ఎవరిపక్షం వహించారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . ఇటు తెరాస నేతలు , అటు బీజేపీ నేతలు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని భావిస్తున్నారు . కొన్ని సర్వేల్లో ఈటల గెలవడం కాయం అన్నట్లు చూపుతున్నా.. మరికొన్ని సర్వేల్లో టీఆర్ఎస్ గెలుపు కష్టమే అన్నట్లు తెలుపుతున్నాయి. రేపు జరగున్న కౌంటింగ్ లో ఎవరు చివరగా గెలువబోతున్నారో చూద్దాం.

READ MORE:

LPG Cylinder Price Hike:భారీగా కమర్షియల్ సిలిండర్‌ ధరలు

Police Raid-On Naga-Shourya Villa: హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడులు

Previous Post
Police Raid-On Naga-Shourya Villa: హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడులు
Next Post
Huzurabad By Election Results:తొలి రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో టీఆర్ఎస్
Police Raid-On Naga-Shourya Villa: హీరో నాగశౌర్య విల్లాపై పోలీసులు దాడులు
Huzurabad By Election Results:తొలి రౌండ్ ముగిసేసరికి ఆధిక్యంలో టీఆర్ఎస్

Recent Posts

Menu