Huzurabad By Election News : గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు TRS పార్టీ బీ-ఫారం

Huzurabad By Election News

Huzurabad By Election – iRAYSMEDIA – HYDERABAD NEWS

Huzurabad By Election – TRS: హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టీఆర్ఎస్ అధినేత KCR పార్టీ బీ-ఫారం అందచేశారు.

CM KCR ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ ఫండ్‌గా 28 లక్షల రూపాయల చెక్కును అభ్యర్థి గెల్లుకి కేసీఆర్ ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు సీఎం కేసీఆర్ ను కలవడం జరిగింది . ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ హుజురాబాద్ లో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.శ్రీనివాస్ యాదవ్ గెల్లు నామినేషన్ ప్రక్రియలో మంత్రులు హరీష్ రావు, గంగుల, కొప్పుల పాల్గొనబోతున్నారు.
కాగా, ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలు మరియు తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే. అక్టోబర్ 30 వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని షెడ్యూల్ ని కూడా కేంద్రం విడుదల చేసింది. ఇందుకోసం ఇవాళ (అక్టోబర్ 1)న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినాషన్ దాఖలుకు అక్టోబర్ 8వ తేదీ తుదిగడువు ఇచ్చారు . నామినేషన్ల ఉప సంవసంహరణకు కోసం అక్టోబర్ 13 చివరి తేదీ. ఇక ఎన్నికలు అక్టోబర్ 30న నిర్వహించి మరి రెండు రోజులు తర్వాత అంటే నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తామన్నారు

ఏపీ లోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ౦లో కూడా అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మన దేశ వ్యాప్తంగా మరో 28 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు కూడా ఇదే షెడ్యూల్ ను ఈసీ అధికారులు విడుదల చేసారు. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి జూన్ 12న రాజీనామా చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

అయితే కాంగ్రెస్ పార్టీ ఇంతరవరకు హుజురాబాద్ అభ్యర్థినే ప్రకటించలేదు. ఆ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది జోరుగా చర్చ జరుగుతుంది . డిసెంబర్ లేదా జనవరిలో షెడ్యూల్ వస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు భావించినప్పటికీ.. ముందే షెడ్యూల్ రావటంతో అభ్యర్థి ఖరారుపై నేతలు ఫోకస్ పెట్టారు. ఒకటి రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కోసం చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అయితే హుజురాబాద్‎లో ఉప ఎన్నికల సందర్భంగా ఈ పదవికి పోటీ చేయడానికి 19 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థి ఎంపిక కోసం ఒక కమిటీ వేయగా ఈ కమిటీ ముగ్గురుని అనగా మాజీ మంత్రి కొండా సురేఖ, సదానందం, పత్తి కృష్ణా రెడ్డి పేర్లను నివేదికలో పొందుపర్చి పీసీసీ, ఏఐసీసీకి నివేదిక అందజేసింది.. మొదట్లో కొండా సురేఖకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినందున స్థానిక నేతలు వ్యతిరేకం అధికమవడంతో కొండా సురేఖ పేరును పీసీసీ నేతలు పక్కన పెట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహతో పీసీసీ తో మరో కమిటీ వేసి ఇంకో అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు.

 

READ MORE : 

Huzurabad Congress candidate: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ? | Huzurabad Congress candidate Konda Surekha?

Operation Huzurabad: ఆపరేషన్ హుజురాబాద్, తెలంగాణలో బిజెపి యాక్షన్ ప్లాన్ | Operation Huzurabad, BJP Action Plan in Telangana

Previous Post
Sajjanar TSRTC Employees Salary : TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్
Next Post
Gachibowli Stadium Hyderabad News:  గచ్చిబౌలి స్టేడియాన్ని కాపాడాలని ధర్నా
Sajjanar TSRTC Employees Salary : TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్
Gachibowli Stadium Hyderabad News:  గచ్చిబౌలి స్టేడియాన్ని కాపాడాలని ధర్నా

Recent Posts

Menu