Huzurabad By Election News: హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ స్వీకరణ వాయిదా

Huzurabad By Election News

Huzurabad By Election News: iRAYSMEDIA

హుజురాబాద్ : హుజురాబాద్ లో ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు రెండు రోజులు బ్రేక్ పడింది అని చెప్పాలి . ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు ఇరువురు అభ్యర్థులు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా అక్టోబర్ 2 శనివారం మహాత్మాగాంధీ జయంతి కాగా , ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి.

దీంతో రెండు రోజులపాటు నామినేషన్ల స్వీకరణకు విరామం లభించింది.

Huzurabad By Election News:టీఆర్ఎస్ పార్టీ ఆభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మొదటి రోజు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు. మన్సూర్ అలీ అన్న వైస్సార్ పార్టీ నుంచి ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందచేశారు. కాగా, వరుసగా రెండు రోజులు ప్రభుత్వ సెలవులు రావడం ఈ నెల 6వ తేది వరకు పితృ అమావాస్య ఉండటంతో నామినేషన్లు వేయడానికి ముహూర్తాలను నమ్మే అభ్యర్థులు వెనకడుగు వేసే అవకాశాలున్నాయి. నామినేషన్ దాఖలు గడువు రెండు రోజులే మిగిలి ఉండటంతో 7, 8 తేదీల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

READ MORE:

Hyderabad TRS Party News:టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాజీనామా

Previous Post
Pawan Kalyan New House : మరో కొత్త బంగ్లా కొన్న పవన్ కళ్యాణ్ ధర ఎంతో తెలుసా
Next Post
Revanth Sounds ‘Jung Siren’:లాఠీ అయినా తూటా అయినా నాకే అన్న రేవంత్ రెడ్డి
Pawan Kalyan New House : మరో కొత్త బంగ్లా కొన్న పవన్ కళ్యాణ్ ధర ఎంతో తెలుసా
Revanth Sounds ‘Jung Siren’:లాఠీ అయినా తూటా అయినా నాకే అన్న రేవంత్ రెడ్డి

Recent Posts

Menu