Huzurabad By Election Latest_Update:తెలంగాణ DGP Mahender Reddy ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్

Huzurabad By Election News

Huzurabad By Election Latest_Update

iraysmedia

Huzurabad By Election Latest_Update:తెలంగాణ DGP Mahender Reddy ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉందని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఆరోపించారు

హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి హుజురాబాద్ వచ్చారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖ రెండు చీలిపోయిందని సీఎం కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య ఆదిపత్య పోరు వల్లే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చాయన్నారు

తెరాస , బీజేపీ పార్టీలు లు రెండు కలిసి తెలంగాణ పరువును దిగజారుస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. మా కాంగ్రెస్ అభ్యర్ధి బల్మూరి వెంకట్ అనామకుడైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా అనామకులేనని ఆయన చెప్పారు. తెలంగాణ రాజకీయం ఎన్నికల పిరాయింపులతోనే నడుస్తుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ డ్రగ్స్ ,సుగంధాలపై సమీక్షలు నిర్వహిస్తుంటే ప్లీనరీ పేరుతో కేటీఆర్ వంటకాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

ఉద్యమాల గడ్డ అయినా తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చిందన్నారు. టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారన్నారు. నిజాం నవాబు దారుల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని ఆరోపించారు.బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని . petrol, Diesel ధరలు అడ్డగోలుగా పెంచారని బీజేపీ ఫై మండిపడ్డారు. అసలు బీజేపీ, టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ప్రజలు ఆలోచించాలన్నారు. త్వరలో టీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేయడంతో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.ఈ నెల 30 హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.ఈ స్థానం నుండి ఈ దఫా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి పోటీ చేశాడు.కౌశిక్ రెడ్డి ఇటీవలనే టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు లభించాయి.

RAED MORE:

Dengue Fever-Cases Rise-In Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు

Send Money Without Internet:ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా ..

Previous Post
Huzurabad By Election:గెల్లుకు మద్దతుగా విద్యార్థి సంఘాలు
Next Post
TRS Plenary Food Menu:తెరాస ప్లీనరీ మీటింగ్లో 34 రకాల భోజన పదార్థాలు
Huzurabad By Election:గెల్లుకు మద్దతుగా విద్యార్థి సంఘాలు
TRS Plenary Food Menu:తెరాస ప్లీనరీ మీటింగ్లో 34 రకాల భోజన పదార్థాలు

Recent Posts

Menu