Huzurabad By Election Campaign:హుజూరాబాద్ లో నేటితో తెరపడనున్న ప్రచారం

Huzurabad By Election Results

Huzurabad By Election Campaign

iRAYSMEDIA

Huzurabad By Election campaign: ఉప ఎన్నికల వేడి క్లైమాక్స్‌కు చేరుకుంది. తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది అని చెప్పాలి.

ఈనెల 30న ఉపఎన్నికల పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంది. అయితే..ఎన్నికల సంఘం హుజూరాబాద్‌లో బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి అనుమంతించింది.

Huzurabad By Election Campaign

టీఆర్‌ఎస్‌, బీజేపీ

ఈటల శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన నాటి నుంచి.. హుజురాబాద్ లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రచారం చేస్తూ వచ్చాయి. సీఎం కేసీఆర్ ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నారు అని చెప్పాలి. గులాబీ పార్టీ గెలుపు కోసం మంత్రి హరీష్‌రావును రంగంలోకి దింపారు సీఎం కెసిఆర్ .హరీష్ రావు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ వెంట గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.అలాగే తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హుజురాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ కూడా హుజురాబాద్ ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంది అనే చెప్పాలి . ఈటల గెలుపు కోసం బీజేపీ పార్టీ అగ్రనేతలందరూ హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటలతో పాటు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ మరియు విజయశాంతి తదితర నాయకులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ గెలుపుకోసం కాంగ్రెస్ నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలో 30న జరగనున్న ఉప ఎన్నికకు పార్టీలన్ని చేస్తున్న ప్రచారం చివరి దశకు చేరడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రచారం చివరి రోజు కావడం తో టీఆర్ఎస్ తరుపున మంత్రులు హరీష్ రావు,కొప్పుల ఈశ్వర్, గంగుల, తదితర ఎమ్మెల్యే ప్రచారం చేయనున్నారు. బీజేపీ తరుపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,తరుణ్ చుగ్, తదితరులు ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరపున శ్రీధర్ బాబు,జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రచారం చేయనున్నారు.

READ MORE:

Anthrax Symptoms In Warangal:గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి

Huzurabad By Election 2021:చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు

Water Supply Stopped In Hyderabad: హైదరాబాద్ కు నిలిచిపోనున్నా మంజీరా నీళ్లు

 

 

 

 

Previous Post
Anthrax Symptoms In Warangal:గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి
Next Post
Minister KTR France Tour:ప్రాన్స్‌కు వెళ్లిన KTR
Anthrax Symptoms In Warangal:గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి
Minister KTR France Tour:ప్రాన్స్‌కు వెళ్లిన KTR

Recent Posts

Menu