Huzurabad By Election:గెల్లుకు మద్దతుగా విద్యార్థి సంఘాలు

huzurabad by election

Huzurabad By Election,

iRAYSMEDIA

Huzurabad By Election

Huzurabad By Election: హుజూరాబాద్‌ త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతు వెల్లువలా వచ్చిపడుతోంది.

విద్యార్థి నాయకుడు, ఉద్యమకారుడు, ఉద్యమంలో భాగంగా ఎన్నో కేసులు ఎదుర్కొని జైలు జీవితం గడిపిన గెల్లు శ్రీనివాస్ యాదవ్. గెల్లును గెలిపించేందుకు విద్యార్థి నాయకులు ప్రతిజ్ఞ చేసారు . సాధారణ విద్యార్థులు సైతం గెల్లుకు ఆర్థికంగా సైతం తోడ్పాటును అందించేందుకు ముందుకు వస్తున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో , ఎంఎస్ఎఫ్‌, బీఎస్ఎఫ్‌, టీజీవీపీ, అంసా,గిరిజన విద్యార్థి సంఘం, స్కాలర్స్​‍ అసోసియేషన్‌, బంజారా విద్యార్థి సేవా సంఘం తదితర విద్యార్థి సంఘాలు గెల్లుకు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సాంగ నాయకులు మాట్లాడుతూ పేదింటి బీసీ బిడ్డను గుర్తించి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టికెట్‌ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే వాడని …ఆలాంటి గెల్లును వ్యక్తిని గెలిపించి శాసనసభకు పంపితే ప్రజల అభ్యున్నతికి పనిచేస్తాడన్నారు. విద్యార్థి ఉద్యమకారులకు టీఆర్‌ఎస్ పెద్దపీట వేస్తూ అనేక అవకాశాలు కల్పిస్తోందని గుర్తు చేశారు. ఆయన గెలుపును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందజేయాలని ప్రజలను కోరారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ ఎన్నికల ఖర్చు కోసం రూ.యాభై వేలను సేకరించారు.

ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థ సంఘాల నాయకులు నక్క శ్రీశైలం యాదవ్‌, మాదారం సుదర్శన్‌, , చందు, బోరెల్లి సురేశ్‌, శ్రీనునాయక్‌, నివాస్, అంజినాయక్‌, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్‌, నేతలు జంగయ్య, కాటం శివ, శ్రీకాంత్‌గౌడ్‌, మిద్దె సురేశ్‌, నాగేందర్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

READ MORE:

Afghan Students: ఆఫ్ఘన్ విద్యార్థుల నుండి భారతదేశానికి విజ్ఞప్తి. అనుమతించమని అభ్యర్థన | Appeal to India from Afghan students. Request to allow

Dengue Fever-Cases Rise-In Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు

Previous Post
Dengue Fever-Cases Rise-In Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు
Next Post
Huzurabad By Election Latest_Update:తెలంగాణ DGP Mahender Reddy ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్
Dengue Fever-Cases Rise-In Hyderabad:గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ కేసులు
Huzurabad By Election Latest_Update:తెలంగాణ DGP Mahender Reddy ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్

Recent Posts

Menu