Huzurabad By-Election 1000 Nominations:హుజురాబాద్ ఉప ఎన్నికలో 1000 నామినేషన్లు

Huzurabad By-Election Special Story

Huzurabad By-Election 1000 Nominations,iraysmedia

Huzurabad By-Election 1000 Nominations:ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బిజెపిలో చేరి మళ్లీ గెలిచి తీరుతాను అని కేసీఆర్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే …అప్పటి నుండి హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన వేడి రాజుకుంది అని చెప్పాలి .

హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ రాక ముందు నుంచి అధికార పార్టీ అయినా టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి . హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను అలాగైనా తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఎన్నో అస్త్రాలను సంధిస్తోన్నాయ్ అన్ని పార్టీలు. ఇలాంటి సమయంలోనే అటు వైయస్ షర్మిల స్థాపించిన వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కానీ.. నిరుద్యోగులు అందరూ భారీగా నామినేషన్లు వేయాలంటూ షర్మిల పిలుపునిచ్చారు.

నిజాంబాద్ అసెంబ్లీ ఎన్నిక సీన్ రిపీట్

షర్మిల ఇచ్చిన పిలుపుతో హుజురాబాద్ ఉప ఎన్నికలో నిజాంబాద్ అసెంబ్లీ ఎన్నిక సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అంచనా వేశారు. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజం అని అర్థమవుతుంది. షర్మిల ఇచ్చిన పిలుపుతో నిరుద్యోగులు కూడా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు అటు TRS ప్రభుత్వ తీరుపై వ్యతిరేకతతో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం నామినేషన్లు వేసే అవకాశం ఉందని అంచనా . ఇక ఇప్పుడు అనుకున్నదే జరిగింది.

ఫీల్డ్ అసిస్టెంట్లు సంచలన నిర్ణయం

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో నామినేషన్లు వేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు సిద్ధమయ్యాము అంటూ ఇటీవలే ప్రకటించారు. మొత్తం 1000 నామినేషన్లు దాఖలు చేస్తామంటూ ఫీల్డ్ అసిస్టెంట్ లు తెలిపారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక కాస్త మరింత రసవత్తరంగా తయారైంది అని చెప్పాలి . ఇక ఇటు ఉద్యోగులు కూడా భారీగా నామినేషన్లు వేస్తామని ప్రకటించారు . దీంతో హుజరాబాద్ ఉప ఎన్నికలో భారీ నామినేషన్ల వల్ల అటు ప్రధాన పార్టీల ఓట్లను చీల్చే అవకాశం ఉంది . ఇది ప్రధాన పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారనుంది. ఇక ఈ భారీ నామినేషన్లు వల్ల ఏ పార్టీకి లాభం .. ఏ పార్టీకి నష్టం అన్నది వేచి చూడాల్సి ఉంది.

READ MORE:

Previous Post
TRS-Party Gives Shocked To-Mallanna:తీన్మార్ మల్లన్నకు మళ్ళి గట్టి షాక్ ఇచ్చిన TRS పార్టీ
Next Post
Mallanna Case High-Court Serious:మల్లన్న కేసుల పై హై కోర్ట్ సీరియస్
TRS-Party Gives Shocked To-Mallanna:తీన్మార్ మల్లన్నకు మళ్ళి గట్టి షాక్ ఇచ్చిన TRS పార్టీ
Mallanna Case High-Court Serious:మల్లన్న కేసుల పై హై కోర్ట్ సీరియస్

Recent Posts

Menu