hyderabad rape victim news:రాజు మృతిపై హైకోర్టు కీలక నిర్ణయం… జుడిషియల్ ఎంక్వైరీ కి ఆదేశం

Uncategorized
రాజు మృతి జుడిషియల్ ఎంక్వైరీ

hyderabad rape victim latest news,iRAYSMEDIA,

hyderabad rape victim latest news:హైదరాబాద్ సైదాబాద్ 6 ఏళ్ల బాలికపై అత్యాచారం హత్య చేసిన నిందితుడు రాజు మృతిపై జుడిషియల్ సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ బాధ్యతను వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కు విచారణ అప్పగించింది. హైకోర్టు ధర్మాసనం కేవలం నాలుగు వారాల్లో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆరేళ్ల బాలిక అత్యాచార హత్య కేసులో నిందితుడు రాజు మృతిపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాన్ని హైకోర్టు ఇచ్చింది. హైకోర్టులో పౌర హక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

అయితే పిటిషనర్ పోలీసులే రాజుని హత్య చేసి, ఆత్మహత్య గా చిత్రీకరించారు అని వాదించారు. ఏజీ రాజుని హత్య చేయలేదని తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడని ఏడుగురి సాక్షులుతో వీడియో రికార్డు చేశామని చెప్పారు. దీనితో పాటు నిందితుడు రాజు శవానికి సంబందించిన పోస్టుమార్టంను కూడా వీడియో రికార్డ్ చేశామని చెప్పారు. అయితే ఆ వీడియోలు రేపు అనగా సెప్టెంబర్ 18న రాత్రి 8గంటల వరకు వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని ఆదేశించింది.

నిందితుడు రాజు మృతిపై ఎన్నో అనుమానాలు…
నిందితుడు పల్లంకొండ రాజుది కస్టడియల్ మృతిగా పలువురు అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ లక్ష్మణ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు కూడా రాజు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే రాజుని ఎక్కడో పట్టుకుని మూడు రోజులు దాచి చిత్రహింసలు పెట్టి చంపి, రైలు పట్టాలపై పడేసి అతమహత్యగా చిత్రీకరించారు అని ఆరోపిస్తున్నారు. హైకోర్టులో ఈ ఆత్మహత్యపై విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

6 Years Old Girl Rape Case: రాజు ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి |Hyderabad 6 Years Girl Rape Case Updates

Hyderabad 6 Years Girl Rape Case: డీజీపీ చెంతకు చేరిన సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు.

Previous Post
దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది..!!
Next Post
Junior Panchayathi Raj Posts : జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది..!!
Junior Panchayathi Raj Posts : జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Recent Posts

Menu