సముద్రపు అంచుల్లో భారీ ఇసుక పాతం

సముద్రపు అంచుల్లో భారీ ఇసుక పాతం

సముద్రపు అంచుల్లో భారీ ఇసుక పాతం

కిలోమీటరు పొడవు + కిలో మీటరు వెడల్పు + కిలో మీటరు లోతు ఉన్న మట్టి

ఒక్కసారిగా నీటి అగాథంలోకి జారిపోతుంటే …. అదీ ఎన్నడూ మానవాళిల కనీవినీ ఎరుగని భయానక దృశ్యం. ఆఫ్రికా పడమటి తీరంలో కాంగో నది సముద్రంలో కలిసే ప్రాంతంలో జరిగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మట్టి, నీరు కలిసిపోయి బురద వరద మైళ్ల దూరం ఇంకా చెప్పాలంటే కిలోమీటర్ల లోతులోకి జారిపోయిన సంఘటన దాదాపు రెండు రోజుల పాటు నిరంతరం సాగిపోయిందని శాస్త్రవేత్తల పరిశోధనలు నిర్ధారించాయి.

మామూలుగా అయితే ఈ ఘటన గురించి ప్రపంచానికి ఏ మాత్రం తెలిసేది కాదు. ఈ బురద వరద తీవ్రత కారణంగా రెండు సబ్ మెరైన్ ల టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడంతో దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసింది. కమ్యూనికేషన్ కేబుల్స్ దెబ్బతినడంతో ఇంటర్ నెట్ సంబంధాలు మందగించిపోయాయి. ముఖ్యంగా నైజీరియా. దక్షిణాఫ్రికా దేశాల మధ్య డేటా ప్రసారాలు స్థంభించిపోయాయి.

నీటి ప్రవాహ వేగాన్ని, బురద ప్రవాహం కదలికలను అంచనా వేసేందుకు అవసరమైన సాధనాలు, పరికరాలతో శాస్త్రజ్ఞులు కాంగో తీరం చేరుకున్నారు. సముద్ర అంతర్గత కదలికల వేగం కారణంగా అట్టడుగున ఉండే వ్యవస్థలు తమకు హెచ్చరికలు అందించినట్లు యునైటెడ్ కింగ్ డమ్ దుర్హమ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ టాల్టింగ్ తెలియజేశారు. బురద వరద వేగం కారణంగా సముద్రపు అట్టడుగున చెలరేగిన అల్లకల్లోలం మరిన్ని రూపాలలో హెచ్చరించింది. నీటితో పాటు జారిపోతున్న మట్టి ఆ ప్రవాహాన్ని మరింత బలోపేతం చేసి సముద్రాన్ని అల్లకల్లోలం చేసింది. ఇలా ప్రవహిస్తున్న వరద బురద తీవ్రత బలపడిపోతోంది తప్ప ఎక్కడా తగ్గుతున్న సూచనలు కనిపించలేదు.

అండర్ వాటర్ అవలాంచ్ గా చెబుతున్న దీనిని శాస్త్రీయంగా టర్బుడిటీ కరెంట్ అని వ్యవహరిస్తారు. ఈ ఘటన గత ఏడాది జనవరి 14న జరిగిందని తెలుస్తోంది. ఆ విషయం ఈ విషయం ఇప్పుడు వెల్లడి కావడానికి కారణం శాస్త్ర్రవేత్తలు అధ్యయనం చేసి నిర్ధారించుకునేందుకు ఇంతకాలం జాప్యం పట్టింది. ఇందుకు రెండు కారణాలు ఉండవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. కాంగో నదిలో 2019 డిసెంబర్ చివరి రోజులలో వచ్చిన అతి భారీ వరదలు కారణం కావచ్చు. సాధారణంగా ఇలాంటి ఘటన 50 ఏండ్లకోసారి జరిగే అవకాశం ఉంటుంది. ఈ వరద తీవ్రత వల్ల పెద్ద మొత్తంలో మట్టి బురద రూపంలో కాంగో నదిలోకి చేరిపోయి ఉంటుంది. అయితే ఈ ఘటన జరిగిన రెండు వారాలా తరువాత మాత్రమే సముద్రంలో ఈ భారీ బురద వరద ప్రవహించినట్లు గుర్తించారు. అందువల్ల ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చని అనుమానం ఉంది.

అయితే ఆ తరువాత జనవరి నెలలో జరిగిన పరిణామం అనూహ్యమైన నీటి ప్రవాహాలు కావచ్చు. సముద్ర జలాల్లో ఒక్కోసారి మన సైక్లోన్ తరహా మార్పులు జరుగుతాయి. అంటే ప్రవాహం స్వల్పంగా ఉన్న చోటికి ఇతర ప్రాంతాల నుంచి నీరు అత్యధిక వేగంతో ప్రవహిస్తుంది. ఆ జోరు కారణంగా నీటి అడుగున ఉన్న మట్టి స్థిరంగా ఉండలేక కదిలిపోతుంది. అలా నీటి ఒత్తిడి కారణంగా జారిపోయిన చోట ఉన్న శూన్యాన్ని ముందుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత క్రమంగా పరిస్థితి చక్కబడుతుందని హల్ యూనివర్శిటీ కి చెందిన ప్రొఫెసర్ డాన్ పార్సన్స్ వివరించారు. ఏది ఏమైనా 2020 జనవరి 14వ తేదీ మన కాలమానం ప్రకారం సాయంకాలం 7 గంటల సమయంలో ప్రారంభమై 16వ తేదీన సాయంకాలం 4 గంటల సమయంలో నిలిచిపోయింది. ఈ రెండు రోజుల వ్యవధిలో సముద్ర గర్భంలో దాదాపు 4500 మీటర్లలోతు వరకు బురద విస్తరించిపోయింది.

Know more about importance of a double face mask explained by Cambridge Professor.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

Previous Post
Apple iOS 15 comes with these models
Next Post
No salaries: Hyatt Regency in Mumbai
Apple iOS 15 comes with these models
No salaries: Hyatt Regency in Mumbai

Recent Posts

Menu