Gangavva House Opening Ceremony : గంగవ్వ కుటుంబంలో పెను విషాదం

Breaking News, Exclusive, Tollywood
Gangavva House Opening Ceremony

Gangavva House Opening Ceremony :  iRAYSMEDIA – HYDERABAD NEWS

Gangavva House Opening Ceremony : యూట్యూబ్ వేదికగా మై విల్లెజ్ షో ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయిన గంగవ్వ అతి కొద్దీ కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఆదరణ పొందింది. సహజమైన నటన, ఎలాంటి కల్మషం లేని మాటలు వలన ఆమె అతి తొందరగా ప్రజలకి దగ్గర అయ్యింది.

బిగ్ బాస్ 4 లో అవకాశాన్ని దక్కించుకున్న ఈ అవ్వ, ఈ షో ద్వారా మరింత సెలబ్రిటీ స్థాయికి ఎదిగింది. దంతో ఆమెకు సినిమా ఛాన్సులు, టీవీ షోలలో గెస్ట్ గా హాజరయ్యే స్థాయికి చేరుకుంది.

బిగ్ బాస్ వేదికగా తన చీర కాల కోరిక ఐన సొంత ఇల్లు గురించే తాను బిగ్ బాస్ కి వచ్చానని నాగార్జున ముందు తెలియజేసింది. దీంతో గంగవ్వ కోరిక నెరవేర్చడానికి నాగార్జున తన వంతు సాయంగా రూ. 7లక్షలు అందజేశారు. ఇవే కాక బిగ్ బాస్ నుండి వచ్చిన డబ్బును కూడా కలిపి తన కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకుంది. ఈ నెల 9న ఆమె తన ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్, శివ జ్యోతితో పాటు పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. మై విల్లెజ్ టీం సభ్యులు ఈ కార్యక్రమానికి దగ్గర ఉంది తగు ఏర్పాట్లు చూసుకున్నారు. ఐతే ఈ గృహ ప్రవేశానికి ఒక్క రోజు ముందే గంగవ్వ కుటుంబంలో ఓ పెను విషాదం చోటు చేసుకుంది.

గంగవ్వ కి సొంత తమ్ముడి ఏకైక కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, 13 రోజులపాటు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొంది గంగవ్వ ఇంటి గృహప్రవేశం ముందు రోజే చనిపోయాడు. ఈ బాధ కారణంగా గంగవ్వ కుంటుంబ సభ్యులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని గంగవ్వ ఓ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసింది.

 

READ MORE :

International Space Station: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తృటిలో పెను ప్రమాదం తప్పింది | International Space Station narrowly missed major accident

BIGGBOSS 5 Double Elimination + Wild Card Entry : 4th Week Suprise

Previous Post
Police Arrests 1CR Bounty Maoist: కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత కిషన్‌దా అరెస్ట్
Next Post
November 14 Children’s Day:భారతదేశం నవంబర్ 14ని బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటుందో మీకు తెలుసా?
Police Arrests 1CR Bounty Maoist: కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత కిషన్‌దా అరెస్ట్
November 14 Children’s Day:భారతదేశం నవంబర్ 14ని బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటుందో మీకు తెలుసా?

Recent Posts

Menu