Forest Department Bribe: అటవీ శాఖ అధికారి రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు | Forest department official demands Rs.15,000 bribe

Forest Department Bribe

Forest Department Bribe: అటవీ శాఖ అధికారి రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు!

Forest Department Bribe:నెల్లిపాక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పూనెం నాగరాజ్ ఒక వ్యక్తికి రూ. 15 వేల లంచం తీసుకుని ఎసిబి అధికారులకు సోమవారం పట్టుబడ్డారు. ఖమ్మం ఎసిబి డిఎస్పీ ఎస్వి రమణమూర్తి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అశ్వపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన బనోత్ వీరన్న, మణుగూరు–కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన ఖాళీగా ఉన్న స్థలంలో రేకుల షెడ్‌ను నిర్మించారు.

అయితే, నాగరాజ్ షెడ్‌ను కూల్చివేసి, ఆకులు, స్తంభాలను తెచ్చి మొండికుంటలోని అటవీ నర్సరీలో ఉంచాడు. స్తంభాలు ఇవ్వమని అడిగితే నాగరాజ్ రూ .15 వేలు డిమాండ్ చేశారు. దీంతో వీరన్న 10 రోజుల క్రితం ఎసిబి అధికారులను సంప్రదించాడు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం, ఎసిబి అధికారులు కేసు నమోదు చేయగా, సోమవారం ఖమ్మం ఎసిబి డిఎస్పి ఎస్.వి.రమణమూర్తి ఆధ్వర్యంలోని మొండికుంట ఫారెస్ట్ నర్సరీకి వచ్చి వీరన్నతో నాగరాజ్కు ఫోన్ చేశారు.

తాను భద్రచలం బస్ స్టాండ్ వద్ద ఉన్నానని, డబ్బు తీసుకొని అక్కడికి రావాలని నాగరాజ్ చెప్పాడు. భద్రాచలం బస్‌స్టాండ్‌లో వీరన్న నుంచి రూ .15 వేలు లంచం తీస్కుంటున్నపుడు నాగరాజ్‌ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఎసిబి సిఐలు శ్రీనివాస్, రవి, రఘుబాబు పాల్గొన్నారు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో నిరాశ, మరింత తెలుసుకోండి.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డెల్హిలో ట్రాక్టర్ యాత్ర చేశారు, మరింత తెలుసుకోండి.

ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ, తెలంగాణ ప్రజలకు అభినందనలు, మరింత తెలుసుకోండి.

దేశంలో కొత్త కరోనా కేసులు, క్రియాశీల కేసులు మరియు మరణాల సంఖ్య 39,361, మరింత తెలుసుకోండి.

తెలంగాణాలో కరోనా కేసుల గిరించి మరింత తెలుసుకోండి.

 

Previous Post
Missile man Abdul Kalam: ఈ రోజు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం మరణ వార్షికోత్సవం | Today is the anniversary of the death of missile man Abdul Kalam
Next Post
Delta Variant Danger:‘డెల్టా’ డేంజర్ గురించి నిపుణుడు చెప్పారు! | Expert says about ‘Delta’ Danger!
Missile man Abdul Kalam: ఈ రోజు మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం మరణ వార్షికోత్సవం | Today is the anniversary of the death of missile man Abdul Kalam
Delta Variant Danger:‘డెల్టా’ డేంజర్ గురించి నిపుణుడు చెప్పారు! | Expert says about ‘Delta’ Danger!

Recent Posts

Menu