Facebook New Name: పేరు మార్చుకున్న ఫేస్‌బుక్

Facebook New Name

Facebook New Name

iRAYAMEDIA

Facebook New Name:

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పేరు మారింది. ఇక నుంచి ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంను ‘మెటా’గా గుర్తించనున్నట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం నిర్ణయించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది.

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికలు ఫేస్‌బుక్ యాజమాన్యం పరిధిలో ఉన్నాయి. అయితే గూగుల్ తరహాలో వీటన్నిటికీ ఒక మాతృ సంస్థ ఉండాలని ఫేస్‌బుక్ భావించింది. అందుకే ఫేస్‌బుక్ అనే పేరును మాతృ సంస్థగా ఉంచి, ఇప్పుడున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంకు కొత్త పేరును పెట్టాలని జూకర్‌బర్గ్ నిర్ణయించారు.

గూగుల్ సంస్థలకు అల్ఫాబెట్ ఇంక్ అనే మాతృ సంస్థ ఉంది. ఈ మాతృ సంస్థ అయినా అల్ఫాబెట్ ఇంక్ పరిధిలోనే గూగుల్‌కు సంబంధించిన అన్ని సంస్థలు పని చేస్తాయి. ఇక నుంచి కొత్త పేరు మెటా,ఇన్‌గ్రామ్‌, వాట్సాప్, లకు కూడా ఫేస్‌బుక్ మాతృ సంస్థలా ఉండనుంది. అయితే గూగుల్‌లా కొత్త పేరుతో కొత్త పేరు పెట్టకుండా ఇప్పటికే పాపులర్‌గా ఉన్న ఫేస్‌బుక్ పేరునే మాతృ సంస్థ పేరుగా ఉంచి, ఇప్పుడున్న ఫేస్‌బుక్ వేదికకు కొత్త పేరును ఖరారు చేశారు.

దశాబ్ద కాలంగా సోషల్ మీడియా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైంది. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజల జీవనంలో సోషల్ మీడియా ఒక భాగమైంది అనే చెప్పాలి . అందులో ఫేస్‌బుక్ ప్రధానమైంది. కాగా, ఫేస్‌బుక్ పేరు మార్పు అనేది సోషల్ మీడియా విభాగంలోనే అత్యంత కీలక పరిణామంగా నెటిజెన్లు చెప్పుకుంటున్నారు.

READ MORE:

Cooking-Gas Cylinder Prices Hiked:భారీగా పెరుగనున్న వంట గ్యాస్ ధరలు

Cricketer VVS-Laxman Political Entry:మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రం

Previous Post
Huzurabad By Election:రంగంలోకి ఎన్నికల అధికార బృందాలు
Next Post
Huzurabad By Poll: హుజురాబాద్ లో రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
Huzurabad By Election:రంగంలోకి ఎన్నికల అధికార బృందాలు
Huzurabad By Poll: హుజురాబాద్ లో రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

Recent Posts

Menu