Etela Rajender Latest News:ఈటలకి కీలక బాధ్యతలు ఇవ్వనున్న బీజేపీ పార్టీ

Etela Rajender Latest News

Etela Rajender Latest News

iRAYSMEDIA

Etela Rajender Latest News:హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్‌.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో KCR కి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

బీజేపీ అధినాయకత్వం ఈటల రాజేందర్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటే.. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవడానికి ఆ పార్టీకి ఆయన ఒక అస్త్రంగా ఉపయోగపడతారని రాజకీయ విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే హుజూరాబాద్‌ నియోజక వర్గం లో విజయం సాధించిన ఈటల రాజేందర్‌ను కేవలం ఓ ఎమ్మెల్యే పదవికి మాత్రమే పరిమితం చేయకుండా.. ఆయనకు బీజేపీ నాయకత్వం కీలకమైన బాధ్యతలు ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ కి ఎమ్మెల్యే పదవి తో బీజేపీ దగ్గర పలు ఆప్షన్లు ఉన్నాయని.. అందులో ప్రధానమైనది ఆయనను రాష్ట్రంలో క్యాంపెనింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించడం అని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే పార్టీలో క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్నవాళ్లు.. ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తుంటారు. తెలంగాణలోని అధికార పార్టీ అయినా టీఆర్ఎస్‌ను టార్గెట్ చేసే విషయంలో ఈటల రాజేందర్‌ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అయితే రాజేందర్ కి ఎక్కువ ప్రకియతని ఇచ్చి ప్రస్తుతం ఉన్న నాయకులను తక్కువ చేయడం వల్ల మరిన్ని ఇబ్బందులు వస్తాయని ఆ పార్టీ హైకమాండ్ యోచిస్తోంది. అందుకే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా .. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలని అనుకుంటోందని.. అందుకే ఆయనకు రాష్ట్ర పార్టీ క్యాంపెనింగ్ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ బీజేపీలో ఇప్పుడున్న పలువురు నేతలు కీలకంగా మారుతున్నారని.. వారితో పాటు ఈటల రాజేందర్‌ కూడా భవిష్యత్తులో మరింత ముఖ్యనేతగా మారతారని టాక్. అయితే బీజేపీలో ఈటల రాజేందర్‌కు కీలక ప్రాధాన్యత ఇవ్వనుంది bjp పార్టీ ఆలా అనుకోవడం వెనుక మరో కారణం కూడా ఉంది అని చెప్పాలి.టీఆర్ఎస్‌లో రెండు దశాబ్దాల పాటు ఉన్న ఈటల రాజేందర్‌కు TRS పార్టీ ముఖ్యనేతలు సహా అన్ని స్థాయిల్లోని నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. వారిని కూడా వీళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళందరిని బీజేపీలోకి తీసుకురావాలంటే.. ముందుగా ఈటల రాజేందర్ కి కీలకమైన బాధ్యతలు, పదవి ఇవ్వాలని బీజేపీ నాయకత్వం ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం.

ఇక తెలంగాణ రాష్టం మొత్తం టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలకు పర్యటించాలని భావిస్తున్న ఈటల రాజేందర్ కూడా క్యాంపెనింగ్ కమిటీ బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.హుజురాబాద్ లో టీఆర్ఎస్‌పై ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్.. BJP పార్టీలో ఎలాంటి కీలక బాధ్యతలు దక్కబోతున్నాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అని చెప్పాలి.

READ MORE:

Huzurabad Election Etela Won:హుజూరాబాద్‌లో ఈటల గెలపునకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?

Huzurabad By Election 2021:చైతన్యవంతులైన హుజూరాబాద్ ఓటర్లు

Previous Post
Teenmar Mallanna Release Update: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు
Next Post
Virat-Kohli Emotional Message To-Fans:విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో అభిమానులకు భావోద్వేగ సందేశం
Teenmar Mallanna Release Update: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు
Virat-Kohli Emotional Message To-Fans:విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో అభిమానులకు భావోద్వేగ సందేశం

Recent Posts

Menu