వరకట్న వేధింపుల కేసుల జోరు !

వరకట్న వేధింపుల కేసుల జోరు!, మహిళల హక్కులపై చర్చ

వరకట్న వేధింపుల కేసుల జోరు! కేరళలో మహిళల హక్కులపై చర్చ:

కేరళలో వరకట్న వేధింపుల కేసుల జోరు! మహిళల హక్కులపై చర్చ. వరకట్న వేధింపులు మహిళా సమాజానికి పెనుశాపంగా మారిన సందర్భంలో ప్రభుత్వంతో పాటు సమాజం మొత్తం పెళ్లిళ్ల సమయంలో కట్నకానుకలను ఇచ్చిపుచ్చుకునే ధోరణికి నో చెప్పాలని, వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని కేరళలోని మహిళా హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  పెళ్లి అయిన తరువాత యువతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ సంఘటనలు రాష్ట్రంలో పెద్ద సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇది ఒక్క కేరళలోనే కాదు, దేశమంతటా అనునిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తుండగా మగ పిల్లలను కన్న తల్లిదండ్రుల ఆశకు, పేరాశకు అంతులేకుండా పోతోంది. దీనిపై ఎంత మంది విమర్శలు చేసినా వారిలో కనీసం చీమ కుట్టినట్లయినా బాధ కనిపించడం లేదు. సరికదా, సమస్య మరింత తీవ్రమవుతోంది.

గతవారం కొల్లాం జిల్లాలో శాస్తంకొట్టలో 24 ఏండ్ల విస్మయ వి నాయర్ భర్త ఇంట్లోనే ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమె భర్త ఎస్. కిరణ్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగి. సంఘటన తరువాత అదే రోజు కిరణ్ కుమార్ స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆతనిపై పోలీసులు భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 408 ఏ (నమ్మకద్రోహం), 304 బి (వరకట్న మరణం) కింద కేసులు బుక్ చేశారు. వాటితో పాటు వరకట్న నిషేధ చట్టం, గృహహింస చట్టాల కింద కూడా కేసులు నమోదు చేసినట్లు మీడియా ద్వారా తెలుస్తోంది. విస్మయ వైద్య విద్య అభ్యసిస్తోంది. ఆమె పెళ్లి నాటి నుంచి అత్తింట ఆరళ్లే ఎదుర్కొంది. పెళ్లి సమయంలో వరుని కుటుంబానికి 100 సవర్ల బంగారం, 1.20 ఎకరా భూమి, సరి కొత్త కారును కట్నకానుకల రూపంలో అందించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన వెలుగు చూసిన రెండు రోజుల్లోనే మరో ఇద్దరు వివాహిత యువతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తిరువనంతపురం జిల్లాకు చెందిన 24 ఏండ్ల అర్చన తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఆత్మాహుతికి పాల్పడింది. ఇక సుచిత్ర (19 ఏండ్లు) పెళ్లి జరిగి ఇంకా మూడు నెలలే అయింది. ఈ కేసులన్నీ ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఉన్నాయి. నెల రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన మరో యువతి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

హక్కుల సంఘాల ఆందోళనలు

ఇలా నవ వధువుల అనుమానాస్పద మరణాలపై మహిళా హక్కుల సంఘాలు తీవ్ర  స్థాయిలో ఆందోళన వ్యక్తంచేశాయి. ప్రభుత్వం తీరును, సమాజం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. లింగ వివక్ష సమస్య తీవ్రతను గొంతెత్తి ప్రకటించాయి. ఇదే సమయంలో స్వతంత్రంగా తమ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునేందుకు యువతులు ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా యువతులు, యువకులు, వారి వారి కుటుంబాలు వరకట్నం విషయంలో స్పష్టమైన, ధృఢమైన నిర్ణయాలు తీసుకుని వాటిని ఇవ్వబోమని, తీసుకోబోమని ప్రతిజ్ఞలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఏ పేరుతో వ్యవహరించిన వరకట్నం దురాచారమే అన్నారు. నిజానికి వరకట్ం నిషేధిస్తూ 60 ఏండ్ల క్రితమే చట్టం తీసుకువచ్చారు. అదే విధంగా రెండేళ్ల క్రితం పార్లమెంటు ఆమోదించిన వరకట్న నిషేధ చట్టం ప్రకారం అయిదేళ్ల జైలు శిక్ష కు ఆస్కారం ఉంది. కట్నం ఇచ్చినా, పుచ్చుకున్నా ఈ శిక్ష వర్తిస్తుంది. అయితే ఈ చట్ట నిబంధనలు పర్యవేక్షించేందుకు అధికారుల నియామకం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అయినందున దానిని పట్టించుకున్న వారే లేరు. ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టరు ఐఏఎస్ అధికారిణి అనుపమ కూడా అంగీకరించారు. వరకట్నం ఇచ్చి లేదా తీసుకుని తమ పిల్లలకు పెళ్లి చేయడాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకించాలని ప్రముఖ రచయిత, మహిళా హక్కుల కార్యకర్త సి.ఎస్. చంద్ర అన్నారు. అత్తింటి ఆరళ్లకు గురయి స్వతంత్రంగా బలకాలనుకుంటున్న మహిళల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రతి పంచాయతీలోనూ, మునిసిపాలిటీలోనూ వసతి సదుపాయం కల్పించాలని ఆమె సూచించారు. తల్లిదండ్రుల నుంచి, భర్త ఇంటి ఆరళ్ల నుంచి వారికి భద్రత కల్పించి, మానసిక వేదన, శారీరిక వేధింపుల నుంచి కాపాడాలని ఆమె అన్నారు.

“నాగరిక సమాజం సంస్కారం అలవరచుకోవాలి. వివాహం అనేది అట్టహాసం, ఆడంబరాల ప్రదర్శనగా మారకూడదు. వరకట్నం అనేది మన ఆడబిడ్డల ఆత్మగౌరవానికి తీరని హాని చేస్తుందని తల్లిదండ్రులు గుర్తించాలి.” అంటున్నారు ముఖ్యమంత్రి పినరయ్ విజయన్.

ఆడబిడ్డ భారమూ కాదు. మగ బిడ్డ ఆస్తీ కాదు. అది సమాజం గుర్తించాలి.

Know more about the marriage of Mamata Banerjee and Socialism.

Also, know more about Covid 19 updates in Telangana.

Previous Post
Don’t have Lands for Dalits, but for private companies?
Next Post
A boy washed away in a drain due to heavy rain in Guntur city
Don’t have Lands for Dalits, but for private companies?
A boy washed away in a drain due to heavy rain in Guntur city

Recent Posts

Menu