DISHA Encounter Case : పోలీసులకు ఉచ్చు బిగిస్తున్న దిశ ఎన్కౌంటర్ కేసు

Breaking News, Crime, Exclusive
DISHA Encounter Case

DISHA Encounter Case : iRAYSMEDIA – HYDERABAD NEWS

DISHA Encounter Case : డాక్టర్‌ దిశ ని నలుగురు నిందుతులు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశంలో కలకలం సృష్టించింది. పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, సీన్‌ రికన్‌స్ట్రక్షన్‌ కొరకు ఘటన స్థలానికి తీసుకెళ్లారు. అదే అదునువుగా చుసిన ఆ నలుగురు నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్కౌంటర్ బూటకమని నిందితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై కోర్ట్ ఏకంగా దిశ కమిషన్ను ఏర్పాటు చేసింది.

పీవీ కృష్ణమాచారి, రజినీ నిందితుల కుంటుంబాలు తరపు న్యాయవాదులుగా వ్యవహహరిస్తున్నారు. ఈ కేసు విషయమై ఇటీవల వీరు కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ” దిశ కేసునిందితుల ఎన్కౌంటర్ కొరకు సుప్రీమ్ కోర్ట్ వేసిన కమిషన్ విచారణ చివరి దశకు చేరిందని తెలిపారు. అయితే ఇప్పడివరకు వారు చుసిన సాక్షముల ప్రకారం ఇది ఫేక్ ఎన్కౌంటర్ గా గుర్తించినట్టు తెలిపారు. ఎందుకంటే నలుగురిలో ముగ్గురు విందులు మైనర్ బాలురు. కావున మైనర్లను జ్యువైనల్ హోమ్ కు తరలించకుండా చర్లపల్లి జైలుకు ఎందుకు తరలించారని, జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా తప్పిదం చేసారని పేర్కొన్నారు.

పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు నిందితులను సీన్ రికన్స్ట్రక్షన్ నిమిత్తం ఘటన స్థలానికి తీసుకెళ్లి వారిని కావాలనే చంపారని పేర్కొన్నారు. అయితే చనిపోయిన నలుగురి వ్యక్తులకు గాయాలున్నాయని కమిషన్ కు తెలిపారు. ఎవరైతే వారిని కావాలని ఎన్కౌంటర్ చేసారో వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలనీ, అలాగే నిందితుల బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని కోర్ట్ ను కోరారు అని బాధిత కుటుంబ తరపు న్యాయవాదులు వెల్లడించారు.

అయితే ఈ కేసుని ఫిబ్రవరి లో పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అప్పడివరకు ఎవరికి ఎలాంటి న్యాయం జరుగుతుందని వేచి చూడాల్సిందే.

 

READ MORE : 

5 Relatives-Of Sushant-Singh-Rajput Killed:రోడ్ ప్రమాదంలో మరణించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువులు

Central Home Department: హోం శాఖ పరిశీలనలో ఉన్న దిశ బిల్లులు | Disha Bills under Home Department consideration

Previous Post
5 Relatives-Of Sushant-Singh-Rajput Killed:రోడ్ ప్రమాదంలో మరణించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువులు
Next Post
Noise Levels Drop In-Hyderabad:హైదరాబాద్ లో తగ్గిన శబ్ద కాలుష్యం
5 Relatives-Of Sushant-Singh-Rajput Killed:రోడ్ ప్రమాదంలో మరణించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువులు
Noise Levels Drop In-Hyderabad:హైదరాబాద్ లో తగ్గిన శబ్ద కాలుష్యం

Recent Posts

Menu