Crime News in Guntur: ఉద్యోగం కోసం తన తండ్రితో గడపాలని భర్త ఆమెను ఆదేశించాడు | Husband orders to her to spend with his father for job

Crime News in Guntur

Crime News in Guntur: ఉద్యోగం కోసం తన తండ్రితో గడపాలని భర్త ఆమెను ఆదేశించాడు!

Crime News in Guntur: తిరుగుబోతు భర్త.. కీచక మామల నుంచి తన కుమార్తెకు రక్షణ కల్పించాలని ఓ మహిళ పోలీసులను వేడుకుంది. అర్బన్‌ ఎస్పీ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళ తన గోడు వెల్లబోసుకుంది. వారు తెలిపిన వివరాలు.. డొంకరోడ్డుకు చెందిన ఎలినేని సందీప్‌ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. 2016 సంవత్సరంలో శ్రీనగర్‌కు చెందిన స్వాతితో వివాహం అయింది. సందీప్‌ టిక్‌టాక్‌ ద్వారా పరిచయం అయిన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని జల్సాగా తిరిగేవాడు.

స్నేహితురాలు అంటూ ఓ మహిళను తరచూ ఇంటికి తీసుకువచ్చేవాడు. సందీప్‌ తల్లి పద్మావతి కూడా అతనికే వత్తాసు పలికింది. 2017 సంవత్సరంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసే పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. కంభంపాడులో నివసించే సందీప్‌ తండ్రి శ్రీనివాసరావు తరచూ మా ఇంటికి వచ్చి స్వాతితో అసభ్యంగా ప్రవర్తించే వాడు. భర్తకు చెబితే తండ్రినే వెనుకేసుకుని వచ్చాడు. పద్మావతి ఉద్యోగం కుమారుడికి రావాలంటే శ్రీనివాసరావు ఎన్‌ఓసిపై సంతకం చేయాలి. ఈ కారణంగా తన తండ్రికి సహకరించమంటూ నా భర్త ప్రోత్సహించాడు. మామ శ్రీనివాసరావు బాత్‌రూమ్‌లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు. కుమారుడిని ఇతర మహిళలతో తిరగకుండా బుద్ది చెప్పాలని, నాకు న్యాయం చేయాలని నా మామను కోరితే నాతో ఉండు నీకు న్యాయం చేస్తానంటూ దుర్మార్గంగా ప్రవర్తించాడు. అనంతర కాలంలో స్వాతికి, ఆమె కుమార్తెకు సరిగా తిండి పెట్టలేదు. మామ లైంగిక దాడికి యత్నించగా ఆమె ఎదురుతిరిగి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది. నువ్వు లొంగక పోతే నీ కుమార్తె (2 సంవత్సరాల పాప) తో కోరిక తీర్చుకుంటానని పాపను లాక్కుని బెదిరించాడు.

శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. 2018 డిసెంబర్‌లో బంధువుల సహాయంతో శ్రీనగర్‌లోని పుట్టింటికి చేరింది. ఒకరోజు భర్త ఇంటి ముందు ఉన్నాను బయటకు రమ్మంటే వెళ్లింది. కొందరు వ్యక్తులు ఆమెపై రాళ్లు విసిరారు. ఫిర్యాదు చేసేందుకు వస్తున్నానని తెలిసి చంపుతామని బెదిరించారు. నాకు, నా కుమార్తెకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలని ఆమె కోరింది.

రైతు భీమా తరహాలో చేనేత కార్మికులకు మేము భీమా అందిస్తాము, మరింత తెలుసుకోండి.

తెలంగాణాలో కరోనా కేసుల గిరించి మరింత తెలుసుకోండి.

Previous Post
Rahul Gandhi cycling to parliament: పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేడు పార్లమెంట్‌కు సైక్లింగ్ చేస్తున్నారు | Rahul Gandhi cycling to parliament to against the rising Petrol-Diesel prices
Next Post
Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు ఎవర్‌గ్రీన్ నటీమణులు ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్ & ఊర్వశి | Aadavallu Meeku Joharlu Evergreen actresses Khushbu Sundar, Radhika Sarathkumar & Urvashi
Rahul Gandhi cycling to parliament: పెరుగుతున్న పెట్రోల్-డీజిల్ ధరలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేడు పార్లమెంట్‌కు సైక్లింగ్ చేస్తున్నారు | Rahul Gandhi cycling to parliament to against the rising Petrol-Diesel prices
Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు ఎవర్‌గ్రీన్ నటీమణులు ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్ & ఊర్వశి | Aadavallu Meeku Joharlu Evergreen actresses Khushbu Sundar, Radhika Sarathkumar & Urvashi

Recent Posts

Menu