Cricketer VVS-Laxman Political Entry:మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రం

Cricketer VVS-Laxman Political Entry

Cricketer VVS-Laxman Political Entry

iRAYSMEDIA

Cricketer VVS-Laxman Political Entry:

మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ అరంగేట్రం
BJPలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్

వీవీఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్‌తో భారతీయ జనతా పార్టీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వీవీఎస్ లక్ష్మణ్ కూడా భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. లక్ష్మణ్ త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం.భారత క్రికెట్ చరిత్రలో తనదైన స్పెషల్ పేజీలు లిఖించిన హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్.. త్వరలోనే పొలిటికల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.

ఇక లక్ష్మణ్ భారత జట్టుకు కీలకమైన విజయాలెన్నో అందించి, 2012లో అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే . తర్వాత ఐపీఎల్‌ టోర్నీలో డెక్కన్‌ చార్జెస్‌ కు వీవీఎస్ లక్ష్మణ్ కెప్టెన్‌ గా వ్యవహరించిన విషయం తెలిసిందే . ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ హైదరాబాద్ సన్‌ రైజర్స్‌ జట్టుకు మెంటర్‌ గా కొనసాగుతున్నాడు.ఐతే లక్ష్మణ్ రిటైరైన తర్వాత హైదరాబాద్ సిటీలోనే అకాడమీ స్థాపించి యువ క్రీడాకారులకు క్రికెట్ లో శిక్షణ ఇస్తున్నాడు. పలు స్వచ్ఛంద సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వీవీఎస్ ఫౌండేషన్ స్థాపించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ తో సుదీర్ఘ అనుబంధమున్న లక్ష్మణ్ ను GHMC పరిధిలోనే ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలపాలని బీజేపీ భావిస్తోందట. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనుక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో లక్ష్మణ్ ను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది, అలా కాని పక్షంలో వీవీఎస్ ని సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నిలబెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇప్పటివరకు లక్ష్మణ్ పొలిటికల్ ఇన్నింగ్స్ పై అధికారిక ప్రకటన రాలేదు.

READ MORE:

Educated Cricketer in India: భారతదేశంలో అత్యంత విద్యావంతులైన క్రికెటర్ ఎవరు? | Who is the most educated cricketer in India?

Indian Cricketer earns Rs 4 lakh in 6 hours

Previous Post
Jammu-Kashmir Terror Attack Today:జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కాల్పులు
Next Post
Cooking-Gas Cylinder Prices Hiked:భారీగా పెరుగనున్న వంట గ్యాస్ ధరలు
Jammu-Kashmir Terror Attack Today:జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కాల్పులు
Cooking-Gas Cylinder Prices Hiked:భారీగా పెరుగనున్న వంట గ్యాస్ ధరలు

Recent Posts

Menu