కోవిడ్ 19 రెండో దశ జూలైతో అంతం – మరో 6 నెలల తరువాతే 3వ దశ ముప్పు!!

కోవిడ్ 19 రెండో దశ జూలైతో అంతం – మరో 6 నెలల తరువాతే 3వ దశ ముప్పు!!

కోవిడ్ 19 రెండో దశ జూలైతో అంతం – మరో 6 నెలల తరువాతే 3వ దశ ముప్పు!!

కేంద్ర నిపుణుల సూచన

కోవిడ్ 19 రెండో దశ ముప్పు మరింకెంతో కాలం బాధించదంటున్నారు కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యల నిపుణుల బృందం. వారి అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశ ప్రజల జీవితాలను, ప్రాణాలను ముప్పుతిప్పలు పెడుతున్న రెండో దశ కరోనా వ్యాప్తి జూలై ఆఖరు వరకు మాత్రమే కొనసాగుతుంది. ఇక మూడో దశ ముప్పు విషయంలో ఆ తరువాత 6 నెలలకు అంటే దాదాపు నవంబర్ ఆ తరువాతి మాసాల సమయంలో ఎదుర్కోవలసి వస్తుందని వారు ప్రభుత్వానికి నివేదించారు.

నిపుణులైన శాస్త్రవేత్తల అంచనాలు ఆశాజనకంగా ఉన్న మాట నిజం. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఈ నిపుణుల బృందం పనిచేస్తుంది. ఈ రకంగా అంచనాలకు వచ్చేందుకు వారు కొన్ని ప్రాథమిక సూత్రాలను పరిగణించారు. దీనిని సూత్ర (Sutra) అని వ్యవహరిస్తారు. ఈ  విధానం ప్రకారం ససెప్టబుల్ (వ్యాధి సోకే అవకాశాలు), అన్ డిటెక్టెడ్ (ఇంతవరకు గుర్తించలేకపోయిన), టెస్టెడ్ (పరిక్షల్లో నిర్ధారణ అయిన), రిమూవ్డ్ (ముప్పు తప్పిపోయిన) చిట్టాల ఆధారంగా తుది అంచనాలకు వస్తారు. వారి లెక్కలను గమినిస్తే మే నెల ఆఖరునాటికి రోజుకు 1.5 లక్ష కేసులు మాత్రమే నమోదయ్యే అవకాశాలున్నాయి. జూన్ ఆఖరుకు ఈ సంఖ్య రోజుకు 20000 కేసులకు తగ్గిపోతుంది.

దూసుకుపోతున్న రాష్ట్రాలు

ఈ నిపుణుల బృందంలోని సభ్యుడు మణీందర్ అగర్వాల్ తన అంచనాలను ఇలా వివరించారు. ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరింది. వాటిలో దేశ రాజధాని ఢిల్లీ, పర్యాటక కేంద్రం గోవా, వాణిజ్య కేంద్రం మహారాష్ట్ర, ఇంకా ఉత్తరప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, రాజస్తాన్, కేరళ, సిక్కిం, ఉత్తర ఖండ్, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా బాధితుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరింది. మరి కొన్ని రాష్ట్రాలు వచ్చే కొద్ది రోజులలో బాధితుల సంఖ్య విషయంలో అధిక సంఖ్యకు చేరే అవకాశాలున్నాయి. వాటిలో తమిళనాడు (మే 29 నుంచి 31వ తేదీల మధ్య), పుదుచ్చేరి (మే 19 – 20 తేదీల మధ్య) లో కేసులు హెచ్చు సంఖ్యలో నమోదు కావచ్చు.  తూర్పు రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితి ఇప్పటివరకు తీవ్ర స్థాయికి చేరుకోలేదు. అస్సాం (మే 20 -21 మధ్య), మేఘాలయ (మే 30 సమయానికి), త్రిపుర (మే 26 – 27 తేదీల మధ్య) రాష్ట్రాలలో కేసులు పేరిగే ప్రమాదం ఉంది. ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్ (మే 24 నాటికి), హర్యానా (మే 22 నాటికి) లలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావచ్చు.

ఇక మూడో దశ ముప్పు?

నిపుణులు అనుసరించిన సూత్ర లెక్కల ప్రకారం మరో 6 నుంచి 8 నెలల తరువాత ముడో దశ కరోనా వ్యాప్తి ఉండవచ్చునని తెలుస్తోంది. మూడో దశ తీవ్రతను అదుపు చేసే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎక్కువగా అక్కడక్కడ మాత్రమే జోరుగా వ్యాపించవచ్చు. అంటే దేశవ్యాప్తంగా ముప్పు ఉండకపోవచ్చనని అంటున్నారు. అందుకు వ్యాక్సినేషన్ వేగవంతం కావడమే అని అంటున్నారాయన. ఏది ఏమైనా అక్టోబర్ వరకు మూడో దస ముప్పు ఉండదట. చివరిగా రెండో దశ తీవ్రతను అంచనా వేయడంలో తాము పూర్తిగా విఫలమయ్యామని ఆయన అంగీకరించారు. తమ అంచనాల ప్రకారం రెండో దశలో రోజుకు లక్షన్నర కేసులు మాత్రమే వస్తాయని అనుకున్నామని ఆయన తెలిపారు.

Also Read: కరోనా నియంత్రణలో సర్కారు వైఫల్యం – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర వైద్యుల లేఖ

కోవిడ్ 19 రెండో దశ జూలైతో అంతం

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)
9490617400
9490617431
For Free cab Services (Rachakonda)
9490617234

CORONA ( COVID 19 ) HELPLINE : 011-23978046 OR 1075

TELANGANA COVID 19 HELPLINE : 104, 8790005197, 040-23286100, 040-23454088

STATE CONTROL ROOM : 040-23450624 / 23450735

Check Telangana COVID-19 Updates: https://covid19.telangana.gov.in

Previous Post
Data Center‌ in Hyderabad‌
Next Post
RJD leader Tejaswi Yadav converts official residence into Covid Care Center
Data Center‌ in Hyderabad‌
RJD leader Tejaswi Yadav converts official residence into Covid Care Center

Recent Posts

Menu