డబుల్ మాస్క్ అవసరమా? కాదా? కేంబ్రిడ్జి ప్రొఫెసర్ అభిప్రాయం!!

డబుల్ మాస్క్ అవసరమా

డబుల్ మాస్క్ అవసరమా? కాదా? కేంబ్రిడ్జి ప్రొఫెసర్ అభిప్రాయం!!

కరోనా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ   చేసింది. ఇదివరకు చేసింది. ఇప్పుడూ చేస్తోంది. వాటిలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ జారీచేసిన సూచనల్లో ఒక మాస్కు కాదు. రెండు వేసుకోవాలనేది ఒకటి.  అయితే కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ లలిత రామకృష్ణన్ అవసరం లేదని అంటున్నారు. మరో రెండు జాగ్రత్తలు కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు కూడా గొప్పగా ప్రభావం చూపవని తెలిపారు. మే 20వ తేదీన కేంద్ర జారీచేసిన సూచనల్లో ఒకటి రెండు మాస్కులకు సంబంధించినది కాగా, కరోనా వైరస్ గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణించగలదన్నది మాత్రమే కాకుండా వీలైనన్ని సార్లు తలుపుల హ్యాండిల్స్, లైట్ స్విచ్ లు, టేబుల్స్ ఇంకా కుర్చీల వంటి వాటిని శుభ్రం చేయాలనేది మరొకటి. అంటు వ్యాధులు, రోగనిరోధక శక్తి రంగాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న లలిత రామకృష్ణన్ అభిప్రాయం ప్రకారం ఈ మూడు సూచనలు కొద్ది మేర ప్రభావం చూపిస్తాయి.

వైరస్ గాలిలో పది మీటర్ల దూరం ప్రయాణించవచ్చుననేది ఆమె కూడా అంగీకరించారు. సైద్ధాంతికంగా అదిసాధ్యమే. సాంకేతికంగా కూడా వాస్తవమే. అయితే అంత దూరం ప్రయాణించిన తరువాత దాని వల్ల పెద్దగా హానిఉండదు. ఇండియాలాంటి దేశంలో ఈ విషయానికి అంతగా ఆందోళన అవసరం లేదు.  నిజానికి ఈ రకమైన హెచ్చరికలను గత సంవత్సరంలో కూడా ప్రభుత్వం జారీచేసింది. కారణాలను అప్పుడూ వివరించలేదు. ఇప్పుడూ వివరించలేదు.

ఇక ఇండ్లలోనూ, బయట ఉండే హ్యాండిల్స్, స్విచ్ లతో పాటు ఇంట్లోని కుర్చీలు, టేబుల్స్ కూడా వీలైనన్ని సార్లు శుభ్రం చేసుకోవాలన్న సూచనను కూడా ఆమె అర్థం లేనిదిగా కొట్టిపారేశారు. వీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఆమె అనుమానం వ్యక్తంచేశారు. దీనిని ఒక జాగ్రత్త చర్యగా కూడా పరిగణించవలసిన అవసరం లేదన్నారు. వీటిని శూభ్రం చేసేందుకు బ్లీచ్ వాడాల్సిన అవసరం లేదని సబ్బు నీరు చాలని చెప్పారు.

చివరిగా రెండు మాస్కులు అన్న సూచనను ఆమె పూర్తిగా తోసిపుచ్చారు. ఇది ఒక మంచి పని చెడు ఫలితానికి కారణమయ్యేలా చేయడమే అని ఆమె వ్యాఖ్యానించారు. వాటి వల్ల ఉపయోగం ఉండవచ్చు. కానీ రెండు మాస్కుల వల్ల ఉక్కబోత, ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందనే వాస్తవాన్ని ఆమె గుర్తుచేశారు. ఇలా రెండు మాస్కుల సూచనను కొట్టిపారేస్తూ ఎన్ 95 మాస్కుల వాడకాన్ని వైద్యులు, వైద్య సిబ్బందికి మాత్రమే నిర్దేశిస్తే బాగుంటుందని సూచించారు. సాధారణ జనాలకు సర్జికల్ మాస్కు లేదా ఇంట్లో సాదా వస్త్ర్రంతో చేసిన మాస్కు తగినంత రక్షణ ఇస్తుందని అభిప్రాయపడ్డారు.

Also Read: కోవిడ్ 19 రెండో దశ జూలైతో అంతం – మరో 6 నెలల తరువాతే 3వ దశ ముప్పు!!

డబుల్ మాస్క్ అవసరమా? కాదా? కేంబ్రిడ్జి ప్రొఫెసర్ అభిప్రాయం!!

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)
9490617400
9490617431
For Free cab Services (Rachakonda)
9490617234

CORONA ( COVID 19 ) HELPLINE : 011-23978046 OR 1075

TELANGANA COVID 19 HELPLINE : 104, 8790005197, 040-23286100, 040-23454088

STATE CONTROL ROOM : 040-23450624 / 23450735

Check Telangana COVID-19 Updates: https://covid19.telangana.gov.in

Previous Post
Vaccine shortage is government negligence: SII ED Suresh Jadhav
Next Post
Curfew reaches 18th day in Andhra Pradesh! Sanctions tightened
Vaccine shortage is government negligence: SII ED Suresh Jadhav
Curfew reaches 18th day in Andhra Pradesh! Sanctions tightened

Recent Posts

Menu