Corona Vaccine 3rd Dose: కరోనా ౩rd డోస్ తప్పనిసరి

Corona Vaccine 3rd Dose

Corona Vaccine 3rd Dose

iRAYSMEDIA

Corona Vaccine 3rd Dose:కరోనా వైరస్‌లో కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నందున వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు రెండు మోతాదుల్లో తీసుకున్నప్పటికీ..మూడో డోసు కూడా అవసరమని అంతర్జాతీయ నిపుణులు వెల్లడించారు

ఈ ప్రతిపాదనపై అటు WHO (world health organization) కూడా బూస్టర్ డోసు తీసుకోవడమే మంచిదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి అనే చెప్పాలి . హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ “బయోలాజికల్‌ – ఇ”.. తాము అభివృద్ధి చేస్తున్న “కార్బివాక్స్‌” టీకాను బూస్టర్‌ డోసు ని మూడో డోసు కింద పంపిణీ చేయాలని భావిస్తోంది.

కార్బివాక్స్‌ను బూస్టర్‌ డోసుగా ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్‌డోసుగా ఇచ్చేలా మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

Corona Vaccine 3rd Dose

ప్రస్తుతం కార్బివాక్స్‌ టీకా మీద రెండు, మూడు దశల క్లినికల్‌ ప్రయోగాలు జరుగుతున్నాయి . ఈ క్లినికల్ పరీక్షలు 18 -80ఏళ్ల లోపు వారిపైజరుపుతున్నారు. ఈ నెలాఖరులో ఆ ప్రయోగాల ఫలితాలను కంపెనీ వెల్లడించనుంది. .. కేంద్ర ప్రభుత్వం ఈ టీకాకు ఇంకా డీసీజీఐ అనుమతులు రాకముందే 30కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.1500కోట్లు చెల్లించింది కూడా.

ఈ మూడోవ బూస్టర్‌ డోసు ప్రయోగాల కోసం బయోలాజికల్‌ – ఇ DCGI అనుమతి కోరింది. ఇప్పటికే కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ టీకా తీసుకున్నవారికి కార్బివాక్స్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చి మూడో దశ క్లినికల్ ప్రయోగాలు చేపట్టాలని భావిస్తోంది. ”టీకా తీసుకున్న కొద్దీ నెలలకే యాంటీబాడీలు తగ్గుతున్నాయని ఇప్పటికే చాలా అధ్యయనాలు ధ్రువీకరించాయి . దీంతో చాలా దేశాలు బూస్టర్‌డోసుపై దృష్టిపెట్టాయి.

ఇప్పటికే కొన్ని దేశాలు మూడోవ బూస్టర్‌ డోసు పంపిణీ కూడా ప్రారంభించాయి. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకొని , కొవిడ్‌ నెగెటివ్‌ ఉన్న వాలంటీర్లపై ఈ ప్రయోగాలు జరపాలనుకుంటున్నాం” అని బయోలాజికల్‌ – ఇ వెల్లడించింది.

READ MORE :

3rd Dose COVID: COVID వ్యాక్సిన్ యొక్క 3 వ మోతాదును స్వీకరించడానికి US అనుమతించబడింది | US are allowed to receive the 3rd dose of the COVID vaccine

 

Previous Post
Amit-Shah Tikely To-Attend Huzurabad: హుజురాబాద్ కి అమిత్ షా
Next Post
Sunday-Funday Events At Charminar:చార్మినార్‌ వద్ద కూడా FUNDAY వేడుక
Amit-Shah Tikely To-Attend Huzurabad: హుజురాబాద్ కి అమిత్ షా
Sunday-Funday Events At Charminar:చార్మినార్‌ వద్ద కూడా FUNDAY వేడుక

Recent Posts

Menu