CORONA Effects ShivaShanker Master : ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కు కరోనా

Breaking News, COVID-19, Exclusive
CORONA Effects ShivaShanker Master

CORONA Effects ShivaShanker Master :  iRAYSMEDIA – HYDERABAD NEWS

CORONA Effects ShivaShanker Master : ప్రముఖ నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కరోనాతో బాధపడుతున్నారు. ఆయనతో పాటు అతని భార్య, పెద్ద కుమారుడు కూడా కరొనకు గురయ్యారు.

హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలాజిలో నాలుగు రోజులుగా శివ శంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య, పెద్ద కుమారుడు హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. అయితే శివ శంకర్ మాస్టర్కి మాత్రం ఊపిరితిత్తుల్లో 75% ఇన్ఫెక్షన్ సోకిన్నరు వైద్య అధికారులు వెల్లడించారు. ఇక శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడైన అజయ్ కృష్ణ మాస్టర్ వీరి బాగోగులు చూసుకుంటున్నారు.

ఇక శివ శంకర్ మాస్టర్ చికిత్సకు రోజుకు దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. వారి కుమారుడి వద్ద అంతే డబ్బు లేనందున వారు సినీ పరిశ్రమ నుండి సహాయం లేదా ఎవరైనా దాతలు వారికీ సహాయం కోసం ముందుకు వస్తారని ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.

శివ శంకర్ మాస్టర్ ఇటు టాలీవుడ్ లోను అటు సాండల్వుడ్ లోను ఎన్నో సినిమాల పాటలకు ఆయన కొరియోగ్రఫీ చేసారు. “మగధీర” సినిమా లోని “ధీర ధీర” పాటకు కొరియోగ్రఫీ చేసినందుకు ఆయనకు జాతీయ పురస్కార అవార్డును అందుకున్నారు. ఆయన బుల్లి తెర లో ని పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహించారు. కొన్ని సినిమాలో నటుడిగా చేసారు. అంతే కాకుండా ఆయన ఎన్నో గొప్ప పాటలకు కోరియోగ్రఫీ చేసి జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్న మాస్టర్కి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరమని ఆయన అభిమానులు ఆవేదనా వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఇటు ప్రజలు, అటు సినీ పరిశ్రమ వ్యక్తులు ప్రార్థిస్తున్నారు.

 

READ MORE :

Bengal Chief Minister: పునరావృతమయ్యే వరదలను తనిఖీ చేయడానికి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి బెంగాల్ కేంద్ర నిధులను అడుగుతుంది | Bengal will ask central funds to implement a master plan to check for recurring floods

Maha Samudram Movie Update:RX 100″ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మరొక చిత్రం

Previous Post
Noise Levels Drop In-Hyderabad:హైదరాబాద్ లో తగ్గిన శబ్ద కాలుష్యం
Next Post
Xiaomi-11T Xiaomi-11T-Pro Redmi-10 Specifications:త్వరలో Xiaomi 11T, Xiaomi 11T Pro,Redmi 10 లాంచ్
Noise Levels Drop In-Hyderabad:హైదరాబాద్ లో తగ్గిన శబ్ద కాలుష్యం
Xiaomi-11T Xiaomi-11T-Pro Redmi-10 Specifications:త్వరలో Xiaomi 11T, Xiaomi 11T Pro,Redmi 10 లాంచ్

Recent Posts

Menu