CM KCR UPDATE || ఇక పై వరి పంట వద్దు అంటూ రైతులకు షాక్

dalitha bandhu cm kcr

ఇక పై వరి పంట వద్దు అంటూ రైతులకు షాక్ ఇచ్చిన కెసిఆర్

ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇకనుండి వచ్చే యాసంగిలో వరి వేయడం అంటే ఉరి వేసుకోవడమనే ప్రసాతవాన వ్యక్తం అయింది. యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలైన పేసర్లు, శనగలు, వేరు శనగలు, ఆవాలు, ప్రొద్దు తిరుగుడు, నువ్వులు, మినుములు, ఆముదాలు, కూరగాయలు లాంటివి పండిస్తే,  రైతులకు లాభదాయకంగా ఉంటుందని సమావేశం అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి ధాన్యం తీసుకోబోమని కేంద్రం స్పష్టంగా చెప్పింది. దీని వల్ల ధాన్యాన్ని మిల్లర్లు కానీ, ప్రభుత్వం కానీ కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి రానుందని తెలిపింది.

ఇదిలా ఉంటె ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్ట్ మేలులు ఇపుడిపుడే ప్రజలకు అందుతున్నాయి. ఈ వానలకు ఊరు వాడ చెరువులు, కుంటలు బాగా నిండడం వల్ల రైతులు ఆనందంగా సాగు చేసుకుంటున్నారు. దీని వల్ల దేశంలోనే అత్యధిక వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇలాంటి సందర్భంలో కెసిఆర్ వరి వద్దంటూ రైతులకి షాక్ ఇచ్చారు.

 

ఈ క్రిందివి కూడా చదవండి:

Rythu Runa Mafi:రైతు రుణ మాఫీ, పంట రుణాల మాఫీ ప్రక్రియ నేటి నుండి ప్రారంభమవుతుంది | Rythu Runa Mafi, Crop loan waiver process starts from today

The crop is gone: పంట పోయింది .. బురద మిగిలింది.. రైతుల నుంచి కన్నీళ్లు | The crop is gone .. the mud remains..Tears from farmers

Previous Post
కిమ్ జోంగ్ ఉన్: 1500 km దూరాన్ని ఛేదించగల అధునాతన ఆయుధాల్ని సమకూర్చుకుంటున్న నార్త్ కొరియా
Next Post
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి ఆఫీస్కు చేరుకున్న నవదీప్.
కిమ్ జోంగ్ ఉన్: 1500 km దూరాన్ని ఛేదించగల అధునాతన ఆయుధాల్ని సమకూర్చుకుంటున్న నార్త్ కొరియా
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడి ఆఫీస్కు చేరుకున్న నవదీప్.

Recent Posts

Menu