Central Government Road-Accident Schemes:ప్రాణాలను కాపాడిన వారికి రూ.5వేలు బహుబతి

National
Central Government Road-Accident Schemes

Central Government Road-Accident Schemes,

iRAYSMEDIA

Central Government Road-Accident Schemes:ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్షణం ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది. అలా మన దేశంలో కూడా ప్రమాదాల్లో చనిపోయిన వారు కనీసం రోజుకొకరు ఉంటారు. మరికొంత మందికి తీవ్ర గాయాలతో బతికి బైట పడుతారు, మరికొందరు అవిటివారై జీవనం గడుపుతుంటారు.

సరైన సమయానికి వారిని కాపడకపోవడం వలన కొందరు వికలాంగులుగా మారుతున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇక నుండి ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను కాపాడిన వారికి ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగి గాయపడిన వారిని మొదటి గంటలోగా అంటే గోల్డెన్ అవర్ లో వారిని ఆసుపత్రికి తరలించిన వారికి రూ.5వేలు బహుబతిగా ఇస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకం 15 అక్టోబర్ 2021 నుండి 31మార్చ్ 2026 వరకు కొనసాగుతుంది అని కేంద్రం ప్రకటించింది. ఈ పథకాన్ని దేశంలోని అన్ని రవాణా శాఖల కార్యదర్శలకు సమాచారాన్ని పంపింది.

సహాయం అందించిన వారికి అయిదు వేల రూపాయలు మాత్రమే కాకుండా ప్రశంస సర్టిఫికేట్ ను కూడా అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఏడాదకొకసారి సాయం అందించిన వారందరిలో పెద్ద సాయం చైనా వారిన ఎంపిక చేసి జాతీయ స్థాయి అవార్డులను అందజేస్తారని తెలిపింది.
వీరికి రూ.లక్ష చొప్పున బహుమతి ఇస్తారని ప్రకటించింది.

చాలా వరకు రోడ్డు మీద ప్రమాదం జరిగిన వారిదగ్గరకు వెళ్ళడానికి కూడా ప్రజలు భయపడుతుంటారు. చూసి కూడా దగ్గరకు వెళ్ళారు. ఇలా చాలా వరకు క్షతగాత్రుల మరణానికి దారి తీస్తుంది. క్షతగాత్రులను కాపాడేందుకే కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

READ MORE:

Intermediate Exam Date 2021: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల టైం-టేబుల్‌లో స్వల్పమార్పులు

Pandora Papers Leak News:దాదాపు 300 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం

Previous Post
Pandora Papers Leak News:దాదాపు 300 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం
Next Post
Prakash Raj MAA Elections:ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ప్యానెల్ కి అసలు అనర్హుడేనా..?
Pandora Papers Leak News:దాదాపు 300 మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం
Prakash Raj MAA Elections:ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ప్యానెల్ కి అసలు అనర్హుడేనా..?

Recent Posts

Menu