బ్రిటిష్ నావికా దళ యోధులకు జెట్ స్యూట్

british-royal-navy-tests-jet-suits-which-will-help-officers-to-fly

సూపర్ మాన్ తరహా ఆకాశగమన శక్తి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఊహించడానికి సాధ్యం కాని సదుపాయాలను అందజేస్తోంది. ఇంతవరకు మనం ఏ దేశానికి సంబంధించి అయినా సరే త్రివిధ దళాలు – వైమానిక, నావికా, పదాతి దళాలు – అన్నవి మాత్రమే ఉంటాయని అనుకుంటున్నాం. ఇప్పుడు బ్రిటన్ బలగాలకు మరో అత్యాధునిక సదుపాయం అందుబాటులోకి వస్తోంది. అదే నావికా దళానికి చెందిన దళాలు సూపర్ మాన్  తరహాలో ఆకాశంలో ఎగురుతూ విహరించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాయి.

జెట్ స్యూట్ పేరుతో తయారుచేసిన అదనపు సామగ్రి మనుషులను ఆకాశంలో ఎగిరుతూ వెళ్ల గలిగుతోంది. అత్యవసర సమయాలలో మారుమూల ప్రాంతాలలో ఉన్న బాధితులకు, ఆపదలో ఉన్న వారికి భరోసా ఇవ్వడం, అవసరమైన చేయూతను అందించేందుకు దీని వల్ల సాధ్యమవుతుంది. బ్రిటిష్ రాయల్ నావికా దళం, నావికా బలగం ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసిన ఈ జెట్ స్యూట్ భూమ్యాకర్షణ శక్తిని ప్రతిఘటించి గాలిలోకి దూసుకుపోగలిగారు. ఎటు వెళ్లాలనుకుంటే అటు గాలిలో విహరించగలిగారు. ఈ క్రమంలో 12 వేల అడుగుల ఎత్తు వరకు నింగిలో చేరుకోగలిగారు.

భూమ్యాకర్షణ శక్తిని ప్రతిఘటించి ఎగిరే అవకాశాలపై పరిశోధనలు ప్రయోగాలు చేస్తున్న గ్రావిటీ ఇండస్ట్రీ కి చెందిన బ్రిటిష్ ఏరోనాటికల్ ఇన్నొవేషన్ సంస్థ దీనిని తయారు చేసింది. రాయల్ నావికా దళం, ఆ సంస్థ కలిసి సంయుక్తంగా విడుదల చేసిన వీడియోలో దాని సామర్థ్యం స్పష్టంగా మనం చూడవచ్చు. వీడియోలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న ఇన్ ఫ్లేమబుల్ బోట్ మీద నుంచి ఒక వ్యక్తి రివ్వున గాలిలోకి ఎగురుతూ అల్లంత దూరంలో ఉన్న తీరప్రాంత రక్షణ దళానికి చెందిన మరో నౌక (హెచ్ఎంఎస్ తామర్)పై దిగడం కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఆయన పైన ఎగురుతూ ప్రయాణిస్తుండగా దిగవన అల్లెత్తున ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలను కూడా గమనించవచ్చు.

ఈ వీడియోలో గాలిలో ఎగురుతూ వెడుతున్న వ్యక్తి ఈ జెట్ స్యూట్ ధరించి ఉన్నాడు. అతని వీపు భాగానికి అమర్చిన యంత్రం సాయంతోనే ఇది సాధ్యమైంది. గాలిలోకి లేచేప్పుడు కానీ, నౌకపై సురక్షితంగా దిగే సమయంలో కానీ ఆతడు ఎలాంటి ఇబ్బంది పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

బ్రిట్ష్ నౌకా దళం సీనియర్ అధికారి అడ్మిరల్ టోనీ రడకిన్ మాట్లాడుతూ, సాంకేతికత, ఆవిష్కరణల మేలుకలయికే ఈ అద్భుత జెట్ స్యూట్ అని అభివర్ణించారు.

అత్యవసర ఆపత్కాలలో ఇది చాలా ఉపయోగకరమని వేరే చెప్పనక్కరలేదు.

Previous Post
Rapid vaccination process. Distribution of over 17 crore vaccine doses so far
Next Post
Atrocities in the suburbs of Hyderabad, an unidentified woman got brutally murdered
Rapid vaccination process. Distribution of over 17 crore vaccine doses so far
Atrocities in the suburbs of Hyderabad, an unidentified woman got brutally murdered

Recent Posts

Menu