బొల్లారం ఆసుపత్రి సేవకు సిద్ధం: MP రేవంత్ రెడ్డి!

బొల్లారం ఆసుపత్రి సేవకు సిద్ధం

బొల్లారం ఆసుపత్రి సేవకు సిద్ధం …..
బొల్లారం ఆసుపత్రి సేవకు సిద్ధం ప్రయత్నం ఫలించింది ! మాటలు కాదు చేతల్లో చూడండి…..!

15 రోజుల కష్టం కొలిక్కి వచ్చింది. సేవకు బొల్లారం ఆసుపత్రి సిద్ధమైంది. కోవిడ్ కష్టకాలంలో నా నియోజకవర్గ ప్రజల వైద్య సేవకు ఆసుపత్రి రెడీ అయింది. నేటి నుండి ఇక్కడ కోవిడ్ వైద్య సేవ ప్రారంభమైంది. మొదటి దశలో 50 పడకల సౌకర్యంతో పాటు, 50 సిలెండర్ల ఆక్సిజన్, ఇతర వైద్య సిబ్బంది, అవసరమైన మందులు, వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు చేశాం.

సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ ఆసుపత్రి ద్వారా ఉపశమనం కలగాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నా నియోజకవర్గంలో ప్రజలకు కష్టకాలంలో ఇది కొంతైనా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాను. నా ఆలోచన కార్యరూపందాల్చడానికి సంకల్పంతో, ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని సహకరించిన అధికార, అనధికారిక వ్యక్తులు, సంస్థలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కష్టకాలంలో మానవతాదృక్పథంతో స్పందించిన దాతలకు అభినందనలు. చేయి చేయి కలుపుదాం. కోవిడ్ మహమ్మారిని తరిమి కొడదాం. మనందరం – మానవులందరం కలిస్తే సాధించలేనిది ఏమీ లేదు. సాటి మనిషికి భరోసా ఇస్తూ… కోవిడ్ ను జయిద్దాం.

మీ రేవంత్ రెడ్డి, ఎంపీ – మల్కాజ్గిరి!!!

ఎంజిఎం వరంగల్‌కు కెసిఆర్ సందర్శన గురించి మరింత తెలుసుకోండి

అలాగే, తెలంగాణలో కోవిడ్ 19 నవీకరణల గురించి మరింత తెలుసుకోండి.
తెలంగాణ కరోనా అత్యవసర సంప్రదింపు సమాచారం:
ఉచిత అంబులెన్స్ కోసం (సైబరాబాద్)
9490617400
9490617431
ఉచిత క్యాబ్ సేవలకు (రాచకొండ)
9490617234

Previous Post
తెలంగాణ ప్రజలను రక్షించడానికి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుకు వచ్చారు
Next Post
Surajpur Collector slapped young man on the road: Got dismissed
తెలంగాణ ప్రజలను రక్షించడానికి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుకు వచ్చారు
Surajpur Collector slapped young man on the road: Got dismissed

Recent Posts

Menu