BIGGBOSS 5 Double Elimination + Wild Card Entry : 4th Week Suprise

BIGGBOSS 5 Double Elimination

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో డబుల్ ఎలిమినేషన్ + వైల్డ్ కార్డు ఎంట్రీ : iRAYSMEDIA – HYDERABAD NEWS

BIGGBOSS 5 Double Elimination : ప్రపంచ వ్యాప్తంగా బిగ్ బాస్ షో గురించి అందిరికి తెలుసు. మన భారత దేశంలో అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు, అన్నిటికి మంచి ఆదరణ లభించింది. అన్ని భాషల కంటే మన తెలుగులో ప్రసారమవుతున్న షోకు మాత్రమే ఎక్కువ ఆదరణ దక్కుతుంది. ఇప్పడివరకు తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని, ఐదవ సీజన్ కూడా ప్రారంభమై ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పడికి మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగవ వారం ఎలిమినేషన్ కు దగ్గరగా వచ్చింది. ఐతే ఎన్నడూ లేని విధంగా ఈ సారి మాత్రం ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి అందరి అభిమానుల్లో ఉంది. ఈ నాలుగవ వారం ఎలిమినేషన్ లో ఒక ట్విస్ట్ ఉందనే వార్త చక్కర్లు కొడుతుంది.

గత బిగ్ బాస్ సీజన్లలో ఎదో ఒక వారంలో డబల్ ఎలిమినేషన్ ఉండేది. ఇక ఈ సీజన్లో కూడా డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. అది ఈ నాలుగవ వారం లోనే జరగడం విశేషం. ఎందుకంటే అన్ని సీజన్ల కంటే ఐదవ సీజన్ ని అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఏ సీజన్లో లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లను ఎంచుకున్నారు. షో మొదటి రోజే గొడవలు, రొమాన్స్, బూతులు ఇలా పలు రకాలుగా వినోదం అందించారు. అందుకే ప్రారంభ ఎపిసోడ్కి 18 రేటింగ్ వచ్చింది. అందుకు గాను బిగ్ బాస్ నిర్వాహకులు కూడా కొత్త కొత్త టాస్కులు నిర్వహిస్తున్నారు. ఇలా మంచి రేటింగ్ తో కొనసాగుతున్న బిగ్ బాస్ కి ఐపీఎల్ ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. బిగ్ బాస్ రేటింగ్ పెంచడానికి నిర్వాహకులు తెగ ఆరాట పడుతున్నారు. మరిన్ని కొత్త ప్రయోగాలతో షోను ఆసక్తికరంగా చేస్తున్నారు.

BIGGBOSS 5 Double Elimination + Wild Card Entry :

అయితే ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఈసారి మరింత కొత్తగా డబల్ ఎలిమినేషన్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అందుకే నాలుగవ వారంలో ఏకంగా ఎనిమిది మందిని నామినేషన్లో ఉంచారు. ఈ ఎనిమిది మందిలో ఏ ఇద్దరు బైటకి వెళ్తారనేది వేచి చూడాల్సిందే.

డబుల్ ఎలిమినేషన్ ఒక ట్విస్ట్ ఐతే ప్రేక్షకులకి డబుల్ షాక్ ఇవ్వనున్నారు. అదేంటంటే ఐదవ వారం ప్రారంభంలో ఓ సెలబ్రిటీని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపిస్తున్నారంట. అది ఎవరు అని కొన్ని పేర్లు నెట్టింట్ల చక్కర్లు కొడుతున్నాయి. వారు ఎవరంటే యాంకర్ వర్షిణి సౌందరాజన్ మరియు సీరియల్ యాక్టర్ నవ్య స్వామి అని వీరిద్దరి పేర్లు మాత్రం బాగా వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్. అందులోను ఈ సీజన్ 5లో ఐదింతలు ఎంటర్టైన్మెంట్ అందిస్తామని నాగార్జున చెప్పారు. అందుకు తగ్గట్టుగానే హౌస్ మేట్స్, నిర్వాహకులు కృషి చేస్తున్నారు.

READ MORE : 

BiggBoss 5 telugu latest update: షో కి స్పెషల్ గెస్ట్ గా రానున్న bollywood హీరో

TELUGU BIGG BOSS 5: అందరికి చిరాకు తెప్పిస్తున్న లహరి | Bigg Boss 5 Latest

 

Previous Post
Sai Pallavi About LoveStory : ముద్దు సీనుపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
Next Post
Sajjanar TSRTC Employees Salary : TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్
Sai Pallavi About LoveStory : ముద్దు సీనుపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
Sajjanar TSRTC Employees Salary : TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

Recent Posts

Menu