Autodriver Wins Lottery Ticket: ఆటో డ్రైవర్ కి రాత్రికి రాత్రే రు.12 కోట్లు

ఆటో డ్రైవర్ కి రాత్రికి రాత్రే రు.12 కోట్లు

ఆటో డ్రైవర్ కి రాత్రికి రాత్రే రు.12 కోట్లు

అదృష్టం ఎపుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలీదు. చాలావరకు సామాన్యులు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినా సంఘటనలు ఎన్నో చూసాం.
ఇక ఇప్పుడు కూడా ఓక ఆటో డ్రైవర్ ని అదృష్టం ఎలా వరించిందో తెలిస్తే షాక్ అవుతారు.

కేరళలో త్రిప్పునితురులో ఓనం పండుగ సందర్భంగా లాటరీ టిక్కెట్లు అమ్మారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం జిల్లాకి చెందిన మారేడులో నివసిస్తున్న జయపాలన్ తనకి లాటరీ వస్తుందన్న నమ్మకం లేకపోయినా కూడా ఈ నెల 10వ తారీఖున ఒకసారి ప్రయత్నిద్దామని కొన్నాడు. ఈ ఆదివారం రోజున అంటే సెప్టెంబర్ 19వ తారీఖున తిరుఓనం బంపర్ లాటరీ నిర్వహించిన యాజమాన్యం దాని ఫలితాలను విడుదల చేసింది. దీంతో అనుహ్యంగా ఆయన కొన్న టికెట్ నంబరే సెలెక్ట్ అయింది. దీని వల్ల ఆ ఆటో డ్రైవర్ రాత్రికి రాత్రే రు.12కోట్లు వచ్చి కోటీశ్వరుడు అయ్యాడు.

ఆయన కొన్న టికెట్ నెంబర్ టీఈ- 645465 సెలెక్ట్ అవ్వడంతో జయపాలన్ ఆనందంతో స్థానికంగా ఉండే కెనరా బ్యాంకుకు వెళ్లిచూపించగా అందరు షాక్ కు గురయ్యారు. అయితే ఈ ఒక్క టికెట్తో పాటు వేరే టికెట్ లు కొన్న వాటికి రాలేదని, ఊహించని విధంగా ఈ టిక్కెట్టుకు వచ్చిందని ఆనందం వ్యక్తం చేసాడు. ఇక లాటరీలో వచ్చిన రు.12 కోట్లలో వివిధ రకాల పన్నులు పోగా మిగిలిన మొత్తం డబ్బులను జయపాలన్ బ్యాంకు నుండి తీసుకున్నట్టు బ్యాంకు అధికారులు తెలిజేశారు.

ఆటో డ్రైవర్ కి రాత్రికి రాత్రే రు.12 కోట్లు వరించాయన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి :

UPI PIN Crime Case in Hyderabad: UPI PIN 1234 తో ఆటో డ్రైవర్ | Auto driver with UPI PIN 1234

Another atrocity in Hyderabad:హైదరాబాద్ లో మరో దారుణం ..20 ఏళ్ల యువతిపై కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు | Another atrocity in Hyderabad..20 Year young woman raped by car driver

Previous Post
Railway Recruitment Cell: రైల్వే శాఖలో 3093 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Next Post
2 Girls Re-Born As Twins : సైన్సుకు అందని అద్భుతం.. పునర్జన్మ రుజువైంది..
Railway Recruitment Cell: రైల్వే శాఖలో 3093 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
2 Girls Re-Born As Twins : సైన్సుకు అందని అద్భుతం.. పునర్జన్మ రుజువైంది..

Recent Posts

Menu