Artificial Kidney For Dialysis || మూత్రపిండాల మార్పిడికి మరోకొత్త యంత్రం

Education, Health
Artificial Kidney For Dialysis

Artificial Kidney For Dialysis:  శరీరంలో మూత్రపిండాలు (Kidneys) చాల ముఖ్యమైన అవయవం . ఒక జీవి మనుగడకి మెదడు,గుండె, మూత్రపిండాలు మూలాధారాలు. జీవి చేసే కార్యకలాపాలన్నిటిని నియంత్రించేది మెదడు అయితే శరీర నలు మూలలకీ రక్తాన్ని ప్రసరింపచెయ్యటానికి పంపు వంటి సాధనం ఏ గుండె. రక్తంలో చేరుతూన్న కలుషితాన్ని గాలించి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు నిరంతరం విరామం లేకుండా పనిచేసి మన శరీరం లో ఉన్న రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. రక్తంలో ఎక్కువున్న నీటినీ, విషతుల్యాలనూ ఎప్పటికప్పుడు వడకట్టేస్తూనే ఉంటాయి. ఒక రోజులో మన మూత్రపిండాలు (Kidneys) దాదాపు 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి .అలాగే ఇవి శరీరం లో నీరు -లవణాల సమతుల్యత దెబ్బతినకుండా చూస్తుంటాయి.అంతే కాకుండా మూత్రపిండాలు రక్తపోటు (blood pressure) ని నియంత్రించటంలో కూడా మూత్రపిండాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

Artificial Kidney For Dialysis

Artificial Kidney For Dialysis:    మన శరీరంలోని మలినాలు బయటికెళ్లిపోవాలన్నా, అణువణువూ ప్రవహించే రక్తం శుద్ధి కావాలన్నా ఈ మూత్రపిండాలు ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే . అలాంటి మూత్రపిండాలు (Kidneys) పాడైపోతే కనుక జీవితాంతం రక్త శుద్ధి కోసం డయాలిసిస్ చేయించుకోవాల్సిందే. డయాలిసిస్ చేయించుకున్నా ఎంత కాలం బతుకుతారో కూడా తెలియదు. సరే ఇవన్నీ ఎందుకు.. ఒకవేళ మూత్రపిండాలు (Kidneys) మార్చుకుందామంటే దానికి ఎన్నెన్నో సవాళ్లు. మరి, దీనికి పూర్తి పరిష్కారం లేదా? అంటే.. తమ దగ్గర ఉందంటున్నారు USA లోని :యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో” శాస్త్రవేత్త నిపుణులు .

Artificial Kidney For Dialysis

‘ద కిడ్నీ ప్రాజెక్ట్’ పేరుతో డయాలిసిస్ కు శాశ్వత పరిష్కారం కోసం వారు ఓ హైబ్రిడ్ మూత్రపిండాన్ని (కృత్రిమ కిడ్నీ) తయారు చేశారు. అయితే దీన్ని చేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజులోనే ఉండే ఈ బయో-ఆర్టిఫిషియల్ కిడ్నీని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. శరీరం ఈ బయో-ఆర్టిఫిషియల్ కిడ్నీని తి రస్కరించకుండా, ఎలాంటి బ్యాటరీల అవసరం లేకుండా, మందులు వాడకుండానే ఈ హైబ్రిడ్ కిడ్నీ పనిచేస్తుంది. రక్తంలోని మలినాలు వేరు చేసి శుద్ధి చేయడమే కాకుండా రక్తపోటు, శరీరం లోని లవణాలను నియంత్రణనూ చూసుకుంటుంది.

 

ఇవి కూడా చదవండి:

Sell their kidneys: వారు తమ మూత్రపిండాలను విక్రయించి చెల్లించాలనుకున్నారు. కానీ …. | They wanted to sell their kidneys and pay. But….

ప్రకృతి విచిత్రం! 24 వేల ఏండ్ల తరువాత ఊపిరి పోసుకున్న సూక్ష్మ జీవి!

Previous Post
Hyderabad Breaking News Today:మంత్రి మల్లారెడ్డిపై మండిపడ్డ వజ్రేష్ యాదవ్
Next Post
Railway Recruitment Cell: రైల్వే శాఖలో 3093 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Hyderabad Breaking News Today:మంత్రి మల్లారెడ్డిపై మండిపడ్డ వజ్రేష్ యాదవ్
Railway Recruitment Cell: రైల్వే శాఖలో 3093 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Recent Posts

Menu