6 Years Girl Raped And Murdered By Neighbour 30 years man Saidabad In Hyderabad

E-Paper

అత్యాచార ఘటనల్లో నిందితులకు ఎంత కఠిన శిక్ష విధించిన ..కొందరి మానవ మృగాళ్ళకి మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదనే చెప్పాలి. ఈ కామ మృగాలకి ఎందరో అమ్మాయిలు బలైపోతున్నారు ..ఇలాంటి ఘటనల్లో విఫలం అయ్యింది ప్రభుత్వమా..సమాజమా అంటూ ఆలోచించుకోవడం తప్ప ఇలాంటివి మల్లి పునరావృత్తమ్ కాకుండా చుడలేకపోతున్నం, మీడియా కూడా దీని మీద ధ్రాష్టికంగా ప్రవర్తిస్తుందనే చెప్పాలి. ఈ కామాంధులు మారాలంటే బలమైన చట్టాలు తీసుకురావాల్సిన అవ్సరం ఎంతైనా ఉంది

హైదరాబాద్: హైదరాబాద్ లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో గురువారం ఆరేళ్ల బాలికపై ఆమె పొరుగువారు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది.
గురువారం మధ్యాహ్నం బాలిక కనిపించకుండా పోయేసరికి కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు కానీ ఆమె ఆచూకీ లభించలేదు, ఆ తరువాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసారు.

కానీ అమ్మాయి తల్లి కి తన పొరుగువాడైనా రాజు కనిపించకుండాపోయేసరికి అనుమానం రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసుల సహాయంతో తమ కుమార్తె కోసం వెతికారు, రాజు ఇంట్లో వెతకగా బెడ్ షీట్‌లో చుట్టిన మృతదేహం నిందితుడి ఇంట్లో దొరికింది.
వెంటనే బాలిక మృతదేహం కనిపించడంతో ఆమె పాక్షికంగా నగ్నంగా ఉందని, తన మీద అత్యాచారం జరిగినట్లు అధికారులు గుర్తించారు.

పోలీసులు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పోస్టుమార్టం కోసం బాలిక మృతదేయాన్ని తరలిస్తుండగా, స్థానిక ప్రజలు అడ్డుకున్నారు,రాళ్లు రువ్వారు .

స్థానిక ప్రజలు ,మరియు సంఘాలు అందరు కలిసి చంపాపేట్ కర్మఘాట్ వద్ద నిరసన వక్తం చేశారు. రహదారులను అడ్డుకోవడం వాళ్ళ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ వచ్చి నిరసన వెక్తులను అరెస్ట్ చేసి పరిస్థితి చక్కదిద్దారు మరియు IS సదన్ మరియు సైదాబాద్ వెళ్లే మార్గాలను మళ్లించారు. నిరసనకారులు బాధితకుటుంబానికి కుటుంబానికి తగిన నష్టపరిహారం యాభై లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

పరిస్థితిని అదుపులోకి ఉంచడానికి అదనపు బలగాలు ఆ ప్రాంతంలోకి మోహరించారు
ఘటన జరిగిన ప్రదేశం చుట్టు ప్రజలు గుమ్మిగూడారు , గట్టి పోలీస్ భద్రత మధ్య మృతదేహాన్ని తరలించారు

పోలీసులు కిడ్నాప్ అత్యాచారం ,హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని
సుబ్బి రామి రెడ్డి ఇన్స్పెక్టర్ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో చెప్పారు.

[సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి వివరాలు గోప్యాంగ ఉంచడం జరిగింది]
Previous Post
ఐపీల్ : Fans కి గుడ్ న్యూస్ చెప్పిన Sunriser Hyderabad Team latest Update
Next Post
కిమ్ జోంగ్ ఉన్: 1500 km దూరాన్ని ఛేదించగల అధునాతన ఆయుధాల్ని సమకూర్చుకుంటున్న నార్త్ కొరియా
ఐపీల్ : Fans కి గుడ్ న్యూస్ చెప్పిన Sunriser Hyderabad Team latest Update
కిమ్ జోంగ్ ఉన్: 1500 km దూరాన్ని ఛేదించగల అధునాతన ఆయుధాల్ని సమకూర్చుకుంటున్న నార్త్ కొరియా

Recent Posts

Menu