4-year-old’s-body found in Banjara-Hills :బంజారాహిల్స్ లో చిన్నారి మృతదేహం కలకలం

4-year-old's-body found in Banjara-Hills

4-year-old’s-body found in Banjara-Hills

iRAYSMEDIA 

4-year-old’s-body found in Banjara-Hills:ఓ దుకాణం ఎదుట చిన్నారి మృతదేహం కలకలం సృష్టించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లోని జలగం వెంగళరావు పార్కు ఎదురుగా ఉన్న మిడ్ టౌన్ భవనం వద్ద ఉన్న లేపాక్షి ఎంబ్రాయిడరీ షాపు వద్ద బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కొన్ని రోజులుగా ఈ దుకాణం తెరువబడి లేదు. అయితే ఈ నెల 4న దుకాణం ముందు ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలిక 4-5 సంవత్సరాల వయస్సు ఉంటుందని, పాప ఒంటిపై గాయాలు ఉండడంతో పలు అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును చేదించేందుకు క్లూస్ టీమును రంగంలోకి దించారు.

దుకాణం చుట్టూ పక్కన ప్రాంతాల్లో ఉన్న సీసీ కేమరాలను పరిశీలిస్తున్నారు. పాప పడి ఉన్న స్థితిని బట్టి ఎక్కడో హత్య చేసి ఈ షాపు వద్ద పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప యొక్క కుడి చెయ్యి వెనక్కి విరిచినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఆ పాప ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టడం వలన తనని గుర్తుపట్టలేకపోతున్నారు. ఘటనా స్థలంలో మద్యం సీసాలు కనిపించడంతో వాటిపై ఉన్న వేలి ముద్రలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. అలాగే బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టంని వీడియో తియించడంతో పాటు సిటిస్కాన్ కూడా చేపించారు. ఆ పాప ఏ విధంగా చనిపోయిందో తేలడం కోసం పోస్టుమార్టం రిపోర్టులు వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే. ఇప్పటివరకు బాలిక గురించి ఎటు వంటి మిస్సింగ్ కేసులు రాకపోవడం గమనార్హం. అందుకోసం ఆ బాలిక యొక్క ఫోటోలను వివిధ ప్రాంతాలలో అంటించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే ఈ క్రింది నంబర్లకు సమాచారం అందించాలని పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి కోరారు.

ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి 9490616610
కందిమల్ల నాగయ్య డీఐ 9490616613
సతీష్ ఎస్ఐ 9490616365
040-27852494

READ MORE:

Vizag Minor Girl Case:వైజాగ్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

Midnight brutal murder in Jubilee Hills

Previous Post
Fun Bucket Bhargav Case:మళ్ళి జైలుకి వెళ్లనున్న ఫన్ బకెట్ భార్గవ్
Next Post
Lieutenant Rishi Ranjan Died :లెఫ్టినెంట్ రిషి కుమార్ వీరమరణం పొందాడు
Fun Bucket Bhargav Case:మళ్ళి జైలుకి వెళ్లనున్న ఫన్ బకెట్ భార్గవ్
Lieutenant Rishi Ranjan Died :లెఫ్టినెంట్ రిషి కుమార్ వీరమరణం పొందాడు

Recent Posts

Menu