సంక్రాంతికి అలరించనున్న పెద్ద హీరోల భారీ సినిమాలు

పెద్ద హీరోల భారీ సినిమాలు

సంక్రాంతికి అలరించనున్న పెద్ద హీరోల భారీ సినిమాలు : iRAYSMEDIA-HYDERABAD

సంక్రాంతి అంటేనే ఏదో తెలియని కొత్త సందడి. అందులోనూ కొత్తగా పెళ్ళైన ఇంట్లో కొత్త అల్లుడ్లు, కోడి పందాలు, ముగ్గులు, పిండి వంటలతో పాటు కొత్త సినిమాలు కూడా.. సంక్రాంతి పండుగకు ఆచారంగా పెద్ద హీరోలు తమ భారీ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు.

తమ సినిమాలు సంక్రాంతి బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్స్ రికార్డ్ సృష్టించాలని ప్రతి హీరో కోరుకుంటాడు. అలాగే భారీ సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తుంటారు.

మూడు రోజులు ఉండే ఈ పండుగకు అందరికీ సెలవులు ఉండడం వల్ల కొత్త సినిమాలకే అందరూ వేచిచూస్తుంటారు. అందుకే ఎక్కువగా చిత్ర నిర్మాతలు కూడా సంక్రాంతి బరిలో తమ సినిమాలు విడుదల చేస్తుంటారు.

కరోనా మహమ్మారి వలన సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు పాతాళంకి పడిపోయాయి. ఇపుడిపుడే సినిమా పరిశ్రమ మెల్లగా కోలుకుంటోంది. కరోనా వల్ల బ్రేక్ రావడం ఏమోగాని కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతగానో అలరిస్తున్నాయి.

అయితే ఈ 2022 సంక్రాంతికి ఎన్నో సినిమాలు సందడి చేయనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఆచార్యతో సంక్రాంతి పండుగ వాతావరణం మొదలవ్వనుంది. చిత్ర యాజమాన్యం ఆచార్య రిలీజ్ డేట్ ను త్వరలో తెలిజేయనున్నరు. ఇప్పటివరకు ఐతే 5 సినిమాలు అఫిషియల్గా తమ సినిమాలు సంక్రాంతికే అని తేల్చేశాయి.

సంక్రాంతికి అలరించనున్న పెద్ద హీరోల భారీ సినిమాలు : 

  • పవన్కళ్యాణ్, రానా హీరోలుగా వస్తున్న సినిమా భీమ్లా నాయక్ BHEEMLA NAYAK  తో పండుగ షురూ కానుంది.
  • అటు తర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట SARKARU VARI PAATA కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది.
  • ఇక పోతే ఫన్, ఫ్రస్ట్రేషన్ అంటూ F 3 F3 సినిమాతో వెంకటేష్- వరుణ్ తేజ్ లు అలరించనున్నారు.
  • ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఐన రాధేశ్యామ్  RADHE SHYAM   జనవరి 14న సందడి చేయడానికి సిద్ధమైంది.
  • కోలీవుడ్ స్టార్ హీరో ఐన అజిత్ కూడా వాలిమై VAALIMAI సినిమాతో సై అంటున్నాడు.

ఇన్ని సినిమాలు కేవలం సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల్ని అలరించడానికి బరిలోకి వస్తున్నాయి. ప్రేక్షకులు కూడా అంతే ఆనందంతో పండుగను కొత్త సినిమాలతో జరుపుకోవడానికి సిద్దంగా ఉన్నారు..

 

ఈ క్రిందివి కూడా చదవండి : 

Pawan Kalyan fans in Pakistan: పాకిస్థాన్‌లో పవన్ కళ్యాణ్ అభిమానులు | Pawan Kalyan fans in Pakistan

Shraddha Srinath: నేను ఏదో కావాలని కోరుకున్నాను మరి చివరికి నటించా | I wanted to be something and finally acted

Previous Post
వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం : విద్యార్థి మృతి
Next Post
Revanth Reddy vs Jagga Reddy : రేవంత్ రెడ్డిపై దుమారం రేపి వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి
వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం : విద్యార్థి మృతి
Revanth Reddy vs Jagga Reddy : రేవంత్ రెడ్డిపై దుమారం రేపి వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి

Recent Posts

Menu