20 వేల ఏండ్ల నాడే కరోనా వైరస్!

20 వేల ఏండ్ల నాడే కరోనా వైరస్!

20 వేల ఏండ్ల నాడే కరోనా వైరస్!

శతాబ్దాల తరువాత జనం అలవాటు పడిపోయారట

తూర్పు ఆసియా ప్రాంతాన్ని 20 వేల ఏండ్ల నాడే కరోనా వైరస్ ముంచెత్తిందట. ఆ తరువాత వందల సంవత్సరాలలో ప్రజలు కరోనా వైరస్ ను తట్టుకోగల సామర్థ్యం సాధించారట. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఆస్ట్రేలియా, అమెరికా శాస్త్రవేత్తల అధ్యయన సారాంశం కరెంట్ బయాలజీ అనే సైంటిఫిక్ జర్నల్ ప్రచురించింది.

దాదాపు 18 నెలలుగా ప్రపంచంలోని అన్ని దేశాలను కుదిపివేస్తున్న కరోనా వైరస్ దుష్ప్రభావం కోట్లాది మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన సంగతి కొత్తగా చెప్పనక్కరలేదు. ఇప్పటికే లక్షల సంఖ్యలో (కనీసం 35 లక్షల మంది) ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు ఆర్థికంగా, మానసికంగా, శారీరికంగా చితికిపోయారు. లాక్ డౌన్ నిబంధనలు జనజీవితాలను తారుమారు చేశాయి బహుశా అవి కోలుకోవడానికి దశాబ్ద కాలం చాలదేమో.

తాజా అధ్యయనాల ప్రకారం 20,000 ఏండ్ల క్రితం ఒకసారి కరోనా వైరస్ ఆసియా ప్రాంతపు తూర్పు దేశాలపై దాడి చేసిందట. ఆనాటి కరోనా వైరస్ తీవ్రత ఎంత తీవ్రంగా ఉండి ఉంటుందంటే మానవ జన్యు క్రమాన్నే మార్చివేసిందట. ఒక రకంగా ఆ నాటి నుంచి మానవ జన్యు పటంలో కరోనా కూడా చేరిపోయి అనేక మార్పులకు కారణమైందట. ఈ అంశం నిర్ధారించేందుకు ప్రపంచంలోని 26 వేర్వేరు జనాభాకు సంబంధించిన 2500 మంది జన్యు చిత్రాలను విశ్లేషణ చేశారు. అప్పట్లో కరోనా వైరస్ దాడికి గురైన ప్రజల వారసులు ఇప్పుడు ఈ దేశాలలో ఉన్నట్లు గుర్తించారు. వారి జన్యు పటం ఆనాటి కరోనా వైరస్ లక్షణాలు సూచిస్తున్నట్లు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. అంటే నేటి ఆధునిక జనాలలో ఆనాటి మానవ సంతతి వారసుల డిఎన్ఏలో కోరనా వైరస్ లక్షణాలు మిగిలే ఉన్నాయి. పరిశోధకులలో ఒకరైన యాసిన్ సోల్మి మాట్లాడుతూ తాము పరిశీలించిన జన్యు కణాలలో కొన్ని వేల ఏళ్ల నాటి మానవుల జన్యుక్రమాన్ని సూచిస్తున్నదని తెలిపారు.

వైరస్ లకు ఉండే ఒక ప్రత్యేక లక్షణం ఏమిటంటే అవి తమ పూర్వరూపాన్ని మళ్లీ పునరుత్పత్తి చేసుకోగలవని , అయితే అందుకు వాటికంటూ స్వతంత్రమైన సాధనమేదీ ఉండదని ఆయన వివరించారు. అంటే ఆ వైరస్ సజీవంగా కొనసాగేందుకు వీలుగా కొన్ని వాహకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి వాహకాలలో స్థిరంగా ఉండి కాలక్రమంలో వేరు వేరు రూపాలు సంతరించుకుంటుంది. అందువల్లనే ముందుగా అవి తమ మనుగడ కోసం వాహకంగా ఉపయోగపడే మార్గాలను గురించి ముందుగా అన్వేషించి, వాటిపై దాడి చేస్తాయి. ఆ వాహకులలో ప్రవేశించిన తరువాత వైరస్ అనేక రకాల రూపాంతరం చెందుతుందని ఆయన వివరించారు. ఇలా వాహకులపై దాడి సమయంలో వైరస్ హైజాక్ చేసిన జీవకణాలు జన్యుపటంలో శాశ్వత ముద్ర వదిలివేస్తాయి.

సాంకేతికంగా సాధించిన పురోగతి కారణంగానే – అలనాటి ఈ వైరస్ ముద్రలను గుర్తించడం సాధ్యమైందని అధ్యయనం చేసిన పరిశోధకులు చెబుతున్నారు. తమ పరిశోధనల సారాంశం – ఇలా జన్యుపటంలో శాశ్వత ముద్ర పడిన వారిపై దాని ప్రభావం అంతగా ఉండడం లేదని, ఒక రకంగా ఆ వైరస్ కు వారి జన్యువులు  అలవాటు పడిపోయాయని వారు చెప్పారు. ఇలాంటి వారిపై తాజా కరోనా వైరస్ ప్రభావం అంతగా కనిపించలేదు. అంటే ఆ తరువాతి తరాల వారిలో ఈ వైరస్ ప్రభావిత జన్యు వైరుధ్యాలు వారికి ఎలాంటి హాని చేయడం లేదని అభిప్రాయపడుతున్నారు. ఈ తరహా జన్యు పటాలున్న జనాభా చైనా, జపాన్, వియత్నాం దేశాలలో ఉన్నట్లు గుర్తించారు.  అయితే ఈ తరహా కరోనా ప్రభావం కేవలం ఈ మూడు దేశాలకే పరిమితమై ఉంటుందని నిర్ణయానికి రాలేమని వారు హెచ్చరించారు. మరెన్నో ఇతర ప్రాంతాలకు కూడా ఈ జన్యుపటం విస్తరించి ఉండవచ్చని, అది నిర్ణయించేందుకు అవసరమైన డేటా ప్రస్తుతానికి లేదని వారు చెప్పారు.

చివరిగా ఈ అధ్యయన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ డేవిడ్ ఎనార్డ్ (యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా) ఇది నిజానికి చాలా ఆందోళన కలిగించే అంశమని హెచ్చరించారు. అంటే ఇవాళ మనం చూస్తున్న కరోనా విలయం తరతరాలుగా ఎదురవుతున్నదే అన్న వాస్తవం ఇక్కడ భయపడవలసిన అంశమని ఆయన వివరించారు. పరిశోధకుల అంచనా ప్రకారం కరోనా వైరస్ ను ప్రతిఘటించగలిగే ఆంటీ వైరస్ రూపాంతరాలు కూడా దాదాపు 20,000 లేదా 25,000 సంవత్సరాలకు ముందే మానవ జన్యుపటంలో ప్రవేశించి ఉండవచ్చని అన్నారు. ఇలా ఇవి పరిణామం చెందడానికి కొన్ని శతాబ్దాల కాలం పట్టి ఉంటుందని తెలిపారు.

Know more about a microorganism that appeared 24 thousand years.

Also, know more about Covid 19 updates in Telangana.

Previous Post
Former MP support for E. Rajendar.. A key development in Telangana
Next Post
Revanth Reddy as TPCC Chief: AICC general secretary
Former MP support for E. Rajendar.. A key development in Telangana
Revanth Reddy as TPCC Chief: AICC general secretary

Recent Posts

Menu