2 Girls Re-Born As Twins : సైన్సుకు అందని అద్భుతం.. పునర్జన్మ రుజువైంది..

Breaking News, Exclusive
2 Girls Re-Born As Twins

2 Girls Re-Born As Twins: సైన్స్ కు అందని రహస్యాలు ఈభూమి మీద ఎన్నో ఉన్నాయి. రోజుకు ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి.. అప్పుడపుడు సాక్షాత్కారం అవుతుంటాయి.. ఇలాగే విశాఖ లో ఒక అద్భుతం జరిగింది.

తల్లికి దూరమైనా ఇద్దరు ఆడపిల్లలు సరిగ్గా వారు చనిపోయిన రోజే, అదే సమయంలోనే జన్మించారు.. మళ్ళీ తమ పిల్లలే తిరిగి వచ్చారని ఆ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోతే వైద్యులు మాత్రం షాక్ లో ఉన్నారు.

అసలు ఎం జరిగిందంటే..

సెప్టెంబర్ 15, 2019 గోదావరి నదిలో అతి పెద్ద ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుండి భద్రాచలం వెళుతున్న వశిష్ట బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 50 మందికి పైగా జల సమాధి అయ్యారు. ఈ బోటు ప్రమాదంలో విశాఖకు చెందిన 3 ఏళ్ల గీతావైష్ణవి, 18 నెలల ధాత్రి అనన్య మృతి చెందారు. బుట్ట బొమ్మలాంటి ఇద్దరు పిల్లలని పోగొట్టుకున్న భాగ్యలక్ష్మి అప్పటికే ఇక పిల్లలు వద్దని ట్యూబెక్టమీ ఆపరేషన్ చేపించుకుంది. దీంతో ఇక పిల్లలు పుట్టారని కృంగిపోయారు.

ఐవిఎఫ్ ద్వారా పిల్లలు మరల కలుగుతారని తెలుసుకున్న అప్పలరాజు భాగ్యలక్ష్మి పిల్లలు కావాలనే కోరిక తో విశాఖలోని ఒక ఐవిఎఫ్ సెంటర్లోని వైద్యులను సంప్రదించారు. అయితే ఐవిఎఫ్ విధానం ద్వారా భాగ్యలక్ష్మికి మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు.

సాధారణంగా ఐతే ఇది సైన్సుకి అందనిది. కానీ వీళ్ళకి దేవుడు కవలలని వరంగా ఇచ్చాడు. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రమాదం జరిగి ఇద్దరు ఆడపిల్లల్ని కోల్పోయిన రోజే, అదే సమయానికే మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు జన్మించడం అనేది ఒక అద్భుతం..

అసలైతే భాగ్యలక్ష్మికి అక్టోబర్ లో డెలివరీ అవ్వాల్సి ఉంది. గత నెలలో పురుటినొప్పులు వచ్చాయి, దీన్ని ప్రీమెచ్యూర్ కావడంతో తగిన జాగ్రత్తలతో పురుడుని వాయిదా వేశారు. మళ్ళీ భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు రావడం తో సెప్టెంబర్ 15న సాయంత్రం ఆపరేషన్ చేసి ఇద్దరు ఆడపిల్లలని బయటకి తీశారు. ఏ సమయానికి ఐతే ఈ తల్లికి ఇద్దరు పిల్లలు దూరం అయ్యారో, తిరిగీ అదే రోజు అదే సమయానికి ఆ తల్లి ఒడికి బిడ్డలు చేరడం అనేది నమ్మశక్యం కానీ నిజం.
అధునాతన టెక్నాలజీ ఆ తల్లిదండ్రులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది..

2 Girls Re-Born As Twins  సైన్సుకు అందని అద్భుతం.. పునర్జన్మ రుజువైంది..

 ఈ క్రిందివి కూడా చదవండి:

Elon Musk: ఎలోన్ మస్క్ అంతరిక్షంలో ప్రకటనలు చేయడానికి మరో అద్భుతం చేయడం ప్రారంభించాడు | Elon Musk started working another wonder to advertise in space

Rave party in the Old City. Obscene dance with girls

Tension in UP: యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఫోర్సెస్ ఆపరేషన్ ప్రారంభిస్తాయి | Anti-Terrorist Squad Forces start Operation

Previous Post
Autodriver Wins Lottery Ticket: ఆటో డ్రైవర్ కి రాత్రికి రాత్రే రు.12 కోట్లు
Next Post
Civil Court Rejected KTR’s Petiton On Revanth Reddy : మంత్రి కేటిఆర్ కు ఎదురు దెబ్బ
Autodriver Wins Lottery Ticket: ఆటో డ్రైవర్ కి రాత్రికి రాత్రే రు.12 కోట్లు
Civil Court Rejected KTR’s Petiton On Revanth Reddy : మంత్రి కేటిఆర్ కు ఎదురు దెబ్బ

Recent Posts

Menu